హీరో
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలలో
నటీస్తూనే, మరో వైపు రాజకీయ
భేటీలతో బిజీ బిజీగా ఉన్నారట.
తాను త్వరలో రాజకీయాలలోకి వస్తానని, 2014 ఎన్నికలలో శాసనసభకు పోటీ చేస్తానని ఆయన
ఇప్పటికే స్పష్టం చేశారు. 2014 ఎన్నికల కోసం ఇప్పటి నుండే
ప్రయత్నాలు చేస్తున్నారట. బాలయ్య ఎన్నికల సమయంలో కాకుండా ముందుగా వస్తేనే బాగుంటుందని ఇటు తెలుగు తమ్ముళ్లు,
మరోవైపు నందమూరి అభిమానులు కోరుతున్నారు.
త్వరలో
రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన బాలయ్య బయటకు ఇప్పటికిప్పుడే ప్రత్యక్ష
రాజకీయాల్లో కనిపించక పోయినప్పటికీ తెర వెనుక మాత్రం
టిడిపి నేతలతో వరుసగా భేటీ అవుతూ బిజీ
బిజీగా గడుపుతున్నారట. వరుసగా ఆయా జిల్లాల నేతలతో
భేటీ అవుతూ.. ఆయా జిల్లాలలో పార్టీ
పరిస్థితిపై ఆరా తీస్తున్నారట. కోల్పోయిన
ప్రాభవం తిరిగి పొందే విషయంపై ఆయన
వారితో చర్చిస్తున్నారట.
అలాగే
నందమూరి అభిమానులకు రాజకీయంగా ఇచ్చే ప్రాధాన్యత పైన
కూడా చర్చిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల గుడివాడ శాసనసభ్యుడు
కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ వైపుకు వెళ్లినప్పుడు బాలయ్య బయటకు వచ్చి తాను
త్వరలో టిడిపి కోసం పని చేస్తానని
చెప్పారు. అప్పటి నుండే ఆయన జిల్లా
నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు. ఓ వైపు వరుస
సినిమాలు తీస్తూనే పార్టీపై బాలయ్య దృష్టి సారిస్తుండటం గమనార్హం.
బాలకృష్ణ
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం, జిల్లా స్థాయి నేతలతో వరుస భేటీలు జరపుతున్న
నేపథ్యంలో పార్టీలో రెండో పవర్ సెంటర్‌కు ఆస్కారం ఉందా
అనే చర్చ టిడిపిలో జరుగుతోందని
తెలుస్తోంది. అయితే బాలయ్య ఇప్పటికే
2014 నాటి తమ పార్టీ ముఖ్యమంత్రి
అభ్యర్థి చంద్రబాబే అని స్పష్టం చేశారని
ఇలాంటప్పుడు రెండో పవర్ సెంటర్
అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని మరికొందరు చెబుతున్నారు.
అయితే సిఎం అభ్యర్థి పేరు
స్పష్టంగా చెప్పినప్పటికీ టిక్కెట్స్ ఇవ్వడం, నామినేటెడ్ పదవులు తదితర అంశాలలో బాలయ్య
జోక్యం బాబుకు తలనొప్పి తీసుకు రావొచ్చునని అంటున్నారు.
0 comments:
Post a Comment