పవన్
కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.
దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. రోజుకో
కొత్త వార్తతో హోరెత్తుతున్న ఈ చిత్రం కథ
అంటూ ఓ కథనం తాజాగా
ప్రచారంలోకి వచ్చింది. ఆ కథ ప్రకారం
పవన్ కళ్యాణ్ ఓ సాధారణ మెకానిక్.
అయితే అతను తన చుట్టూ
సమాజంలో జరిగే అన్యాయాలకు,అక్రమాలకు
స్పందిస్తూంటాడు. తన పరిధికి మించినా
సరే అక్రమాలపై పోరాడుతూంటాడు.
ఈ నేపధ్యంలో అతనికి గంగ (తమన్నా) పరిచయమవుతుంది.
ఆమె ఓ టీవీ ఛానెల్
లో పనిచేస్తూంటుంది. ఆమె కూడా ఏదైనా
సమాజానికి చేయాలనుకుంటుంది.. కానీ ఆమెకు ఎవరూ
సహకరించరు. ఈ నేఫద్యంలో ఆమెకు
రాంబాబు నిజాయితీ, అతను అన్యాయాలపై పోరాడే
తీరు చూసి నచ్చి అతనితో
కలిసి పనిచేయాలనుకుంటుంది. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత
రాంబాబు ఆమె సాయింతో రంగంలోకి
దిగుతాడు. దొంగ స్వామీజీలు,స్కాములుపై
అతను చేసే అక్రమాలు సంచనలనం
రేపుతాయి.
మీడియాలో
అతనో సంచలనం అవుతాడు. ఈ క్రమంలో ప్రకాష్
రాజ్ అనే పెద్ద స్ధాయి
మినిస్టర్ రైవర్లీ ఏర్పడుతుంది. అతనికి సంభదించిన స్కూప్ ..రాంబాబుకి దొరకుతుంది. అక్కడ నుంచి రాంబాబు
ఏం చేసాడు. అతను ఏక్టివిటీస్ తో
యువతలో ఏ విధంగా చైతన్యం
తెచ్చాడు అనే దిసగా కధనం
నడుస్తుంది. అయితే ఈ కథ
నిజంగా లీకైందా లేక మీడియా వర్గాల
ద్వారా పుట్టిందా అనేది తెలియాల్సి ఉంది.
అయితే పవన్ మాత్రం ఈ
చిత్రంలో మెకానిక్ గా పనిచేస్తున్నాడనేది నిజం.
ఈ చిత్రం ప్రారంభైమన నాటినుండీ విపరీతమైన క్రేజ్ ని ట్రేడ్ వర్గాల్లో
తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రం
ఓవర్ సీస్ రైట్స్ కూడా
ఓ రేంజిలో పలుకుతూ పవన్ స్టామినా ఏమిటో
తెలియచేస్తున్నాయి. ఐదు కోట్ల రూపాయలు
వరకూ ఈ చిత్రం ఓవర్
సీస్ రైట్స్ అడుగుతున్నట్లు సమాచారం. అలాగే లండన్‌కి
చెందిన స్కార్లెట్ ఈ చిత్రంలో ఐటం
సాంగ్ చేసింది. ఆమె ఇంతకు ముందు
హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్
గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్ చిత్రం
'ఎవడు'లోనూ నర్తించింది.
ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. నేటి రాజకీయాలపై ఓ
వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ
రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్
కళ్యాణ్, తమన్నా కలిసి నటిస్తున్న తొలి
సినిమా కూడా ఇదే. అక్టోబర్
18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని
విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.
0 comments:
Post a Comment