హైదరాబాద్:
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, లీడ్ ఇండియా ప్రతినిధి
వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్టు కేసులో
సిఐడి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాల్ డేటా సేకరణలో
డిటెక్టివ్ ఏజెన్సీ పాత్రకీలకమని భావిస్తున్న అధికారులు ఈ వ్యవహారమంతా మహారాష్ట్రలోనే
జరిగినట్లు గుర్తించారు. సికింద్రాబాద్‌లోని డిటెక్టివ్ ఏజెన్సీ
ప్రతినిధిని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు.. తర్వాత నాందేడ్‌కు వెళ్లి కీలక
సమాచారంసేకరించినట్లు తెలిసింది.
మహారాష్ట్ర
కేడర్‌కు చెందిన పోలీస్
ఉన్నతాధికారి సాయంతో ఓ డిటెక్టివ్ ఏజెన్సీ
వివరాలు సేకరించినట్లు జేడీ లక్ష్మీనారాయణ అనుమానం
వ్యక్తం చేసిన నేపథ్యంలో నాగ్‌పూర్‌లోని డిటెక్టివ్
ఏజెన్సీ ప్రతినిధులను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చంద్రబాల
కాల్ లిస్టుకు సంబంధించిన వ్యవహారంలో సస్పెండైన (నాచారం)ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావును
ప్రశ్నించిన సీఐడీ అధికారులు.. ఆయనిచ్చిన
సమాచారం ఆధారంగా సాక్షి విలేకరి యాదగిరిరెడ్డి పాత్రపై నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
డిసిపి
మెయిల్ నుంచి యాదగిరిరెడ్డికి చంద్రబాల
కాల్ డేటా పంపించినట్లు శ్రీనివాసరావు
తెలిపినట్లు సమాచారం. దీని ఆధారంగా జూన్
25న సాక్షి టీవీలో ప్రసారమైన క్లిప్పింగుల కోసం సిఐడి నోటీసులు
పంపింది. ఇక ఇప్పటికే స్వాధీనం
చేసుకున్న హార్డ్‌డిస్క్‌ను కూడా ఫోరెన్సిక్
సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)కు పంపినట్లు తెలిసింది.
కాగా, లక్ష్మీనారాయణ, చంద్రబాల మధ్య ఫోన్ సంభాషణలపై
ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యేల నుంచి వాంగ్మూలాలు తీసుకోవాలని
దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కాల్ లిస్టు బాధితులైన
క్రైం రిపోర్టర్లను కూడా పిలిపించే అవకాశాలు
కనిపిస్తున్నాయి.
'లీడ్
ఇండియా -2020' కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించేందుకే వాసిరెడ్డి చంద్రబాల సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ,
'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఎండీ రాధాకృష్ణ, ఇతర
మీడియా ప్రతినిధులతో మాట్లాడారని, మెయిల్స్ కూడా పంపినట్లు తమ
దర్యాప్తులో తేలిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ మానవహక్కుల సంఘానికి
నివేదించారు. చంద్రబాల ఫిర్యాదుపై హెచ్ఆర్‌సీ ఆదేశాల మేరకు
సోమవారం పోలీసులు ఓ నివేదిక సమర్పించారు.
తమ దర్యాప్తులో తేలిన విషయాలను నివేదికలో
అన్నారు. దీంతో వచ్చే నెల
6న దీనికి సంబంధించిన కేసుల పురోగతిపై మరో
నివేదిక ఇవ్వాలని పోలీసులను హక్కుల కమిషన్ ఆదేశించింది.
0 comments:
Post a Comment