హైదరాబాద్:
సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును,
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రైతు సమస్యలపై తెలుగుదేశం,
సిపిఐ, లోక్‌సత్తా తదితర
పార్టీలు ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను చేపట్టాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు ధర్నాలో మాట్లాడారు. రైతు సమస్యలపై స్పందించడంలో
రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
వడ్డీ
వ్యాపారులపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పది శాతం రుణాలు
కూడా రైతులకు ఇవ్వడం లేదన్నారు. పావలా వడ్డీ ఎక్కడా
అమలు కావడం లేదని మండిపడ్డారు.
రైతులకు అండగా ప్రభుత్వంపై తమ
ఈ పోరాటం కేవలం ఆరంభం మాత్రమే
అన్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. విత్తనాలు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.
రాబోయే కాలంలో రైతులకు ఏం చేయబోతున్నామో తాము
ఇప్పటికే హామీ ఇచ్చామని తెలిపారు.
ధర్నా
పూర్తయిన అనంతరం చంద్రబాబు, నారాయణ, పలువురు రైతు సంఘాల నేతల
ఆధ్వర్యంలో చలో సచివాలయం చేపట్టారు.
ఇందిరాపార్క్ ప్రధాన ద్వారం వద్ద వారిని పోలీసులు
అడ్డుకున్నారు. దీంతో బాబు, నారాయణ,
రైతు సంఘాల నేతలు అక్కడే
రోడ్డుపై బైఠాయించారు. తమను సచివాలయం వెళ్లేందుకు
అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరాకరించడంతో టిడిపి, సిపిఐ కార్యకర్తలు పోలీసులతో
వాగ్వాదానికి దిగారు.
పరిస్థితి
ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాబును, నారాయణను, రైతు నేతలను అరెస్టు
చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేతల
అరెస్టుపై కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ నేతలను వెంటనే
విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
అవసరమైతే బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ వెళ్లి వారిని విడిపించుకుంటామని చెప్పారు. అరెస్టు సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ... రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంట్ కోత, విత్తనాలు అందక
వారు ఆవేదన చెందుతున్నారని, వెంటనే
వారి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment