నిఖిల్,
కలర్స్ స్వాతి జంటగా ‘స్వామి రా..రా..' పేరుతో
ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి
చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేడు ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలవుతుంది. వరస
ప్లాపుల్లో ఉన్న నిఖిల్,కలర్స్
స్వాతి ఇద్దరూ ఈ చిత్రంపై ఆశలు
పెట్టుకున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...‘‘మా తొలి ప్రయత్నంగా
నిఖిల్‌తో ‘వీడు తేడా'
నిర్మించాం. ఆ సినిమా మంచి
హిట్ అయ్యింది. ఈ రెండో సినిమాని
కూడా ఎక్కడా రాజీ పడకుండా లావిష్‌గా తెరకెక్కించనున్నాం. కేరళ, కర్నాటక,
తమిళనాడుల్లోని పలు అందమైన ప్రదేశాల్లో
చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.. రవిబాబు, జీవా, పూజ, ప్రవీణ్
తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్ డిఎఫ్‌టి, సంగీతం:
సన్ని, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
పాటలు: కృష్ణచైతన్య, సహ నిర్మాత: సందీప్
కొరటాల.
ఇక ప్రస్తుతం కలర్స్ స్వాతికి పెద్దగా సినిమాలు తమిళంలోనూ లేవు. తెలుగులో కందిరీగ
తర్వాత ఆఫర్లేమీ రాలేదు. ఆ మధ్య ఇంద్రగంటి
మోహన్ కృష్ణ డైరక్షన్ లో
ఓ సినిమా అనుకున్నారు కానీ అది ముందుకు
వెళ్లలేదు. అప్పలరాజు డిజాస్టర్ కావటంతో ఆమెను హీరోయిన్ గా
తీసుకునే వారు సైతం కరువయ్యారు.
అయితే ఈ విషయమై కలర్స్
స్వాతి సొంత విశ్లేషణ చేసుకుటోంది.
ఆమె మాట్లాడుతూ..."నా బలహీనత గురించి
చెప్పాలంటే... నాకు కొంచెం నోటి
దురుసు ఎక్కువ. దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఈ కారణంగా చాలామందిని
‘హర్ట్' చేశాను" కూడా అంటోంది కలర్స్
స్వాతి. చెన్నయ్‌లో ఓ ప్రైవేటు
కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ
"ఇలా స్పందించింది. అలాగే ..నేనేమీ హఠాత్తుగా హీరోయిన్ కాలేదు. యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి
హీరోయిన్ అయ్యాను. ఈ ప్రయాణంలో నాపై
ఎన్నో రూమర్లు, మరెన్నో విమర్శలు వచ్చాయి. గాసిప్స్ ను అస్సలు పట్టించుకోను.
అర్హత కలిగిన విమర్శలను మాత్రం గౌరవిస్తాను" అంది.
0 comments:
Post a Comment