హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు పరిధిలో ఉన్నారు కాబట్టే తాము అతనిని విచారించేందుకు
అనుమతి కోరుతున్నామని ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్
డైరెక్టరేట్) సోమవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు
తెలిపింది. జగతిలోకి పెట్టుబడులపై జగన్‌ను విచారించేందుకు
అనుమతివ్వాలని ఈడి పిటిషన్ దాఖలు
చేసిన విషయం తెలిసిందే. దీనిపై
సోమవారం కోర్టులో ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా ఈడి తరఫు న్యాయవాది
తన వాదనలు వినిపించారు. జగన్ మనీలాండరింగ్‌కు
పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. సిబిఐ సమర్పించిన ఛార్జీషీట్‌లు పరిశీలించి ప్రాథమిక
ఆధారాలు సేకరించామని చెప్పారు. పిఎంఎల్ఏ చట్టం 50(2) కింద ఎవరినైనా విచారించే
అధికారం తమకు ఉందన్నారు. చట్టాలను
ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చిన సంస్థలకు నోటీసులు జారీ చేసి, ఆ
సంస్థల లావాదేవీలపై దర్యాప్తు చేసే అధికారం తమకు
ఉందని, ఈ విషయంలో ఎవరూ
తమను నియంత్రించలేరని వెల్లడించారు.
జగతి
కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఆ సంస్థలోకి నిధుల
రాకపై ఆరోపణల నేపథ్యంలో దాని చైర్మన్, ఎండిగా
పనిచేసిన వైయస్ జగన్‌ను
ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోర్టుకు
తెలిపింది. కేసు అవసరరీత్యా అనుమతివ్వాలని
ఈడి న్యాయవాది కోరారు. జగన్‌ను నిందితుడిగా
పిలవలేదని, పిఎంఎల్ఏ చట్టం కింద అనుమానాలున్నాయని,
అందులో భాగంగానే ఆయన్ను ప్రశ్నించేందుకు నోటీసులు ఇచ్చామని, ఇది పోలీస్ కస్టడీ
కాదని, డిఫెన్స్ న్యాయవాదులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియడం లేదన్నారు.
జగతి
చైర్మన్‌గా, ఎండీగా జగన్
ఎప్పుడు రాజీనామా చేశారనేది అప్రస్తుతమన్నారు. ఐపిసి సెక్షన్లతోపాటు, పిఎంఎల్ఎ,
ఫెమా చట్టాల ఉల్లంఘనలపై ఈడి దర్యాప్తు చేస్తుందని,
అందులో భాగంగా ఆరోపణలు వచ్చిన సంస్థలకు నోటీసులు ఇచ్చి, ప్రశ్నించే అధికారం తమకు ఉందన్నారు. జగతికి
అలాగే నోటీసులు ఇచ్చామని ఈడి లాయర్ వ్యాఖ్యానించారు.
కాగా ఈడి పిటిషన్ పైన
జగన్ అంతకుముందు కౌంటర్ దాఖలు చేశారు. ఈ
కేసులో ఈడికి తాను చెప్పాల్సింది
ఏమీ లేదని, తన వద్ద తగిన
సమాచారం ఏమీ లేదని జగన్
కోర్టుకు తెలిపారు. తాను జగతికి చైర్మన్‌ను, డైరెక్టర్‌ను
కాదని, విచారణకు అనుమతించవద్దని తెలిపారు.
0 comments:
Post a Comment