హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
అనుచరుడు సూరీడుకు మంగళవారం సచివాలయంలో చుక్కెదురయింది. సూరీడు ముందస్తు అనుమతి లేకుండా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలోకి
వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆయనను అక్కడే
ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అనుమతి లేనిదే లోపలకు పంపించేంది లేదని ఆయనకు స్పష్టం
చేశారు.
దీంతో
సూరీడు కాసేపు అక్కడే నిలబడ్డాడు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి అనుమతి
కోరారు. వారు అనుమతించడంతో భద్రతా
సిబ్బంది సూరీడును ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లనిచ్చారు. కాగా సూరీడు ముఖ్యమంత్రి
హయాంలో ఆయన ప్రధాన అనుచరుడిగా
ముద్రపడిన విషయం తెలిసిందే. అప్పుడు
ఆయన హవా నడిచినట్లుగా వార్తలు
వచ్చాయి కూడా.
మరోవైపు
అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి ఎస్‌వి సుబ్బా రెడ్డి,
ఆయన తనయుడు మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో కలిశారు.
బ్యాడ్‌మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
జైలులో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు.
ఈ రోజు జగన్ బెయిల్
పిటిషన్ పైన హైకోర్టులో తీర్పు
వెలువడనుంది. బెయిల్ పిటిషన్ పైన ఇటీవల రెండు
రోజుల పాటు జగన్ తరఫు
న్యాయవాది, సిబిఐ తరఫు న్యాయవాది
వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు
తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు
వెలువడనుంది.
0 comments:
Post a Comment