హైదరాబాద్:
తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని రాజకీయ
కోణంలో చూడవద్దని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు
హరికృష్ణ గురువారం ఉదయం విజ్ఞప్తి చేశారు.
ఈ దాడిని కుటుంబాల మధ్య వివాదంగా మార్చ
వద్దని కోరారు. దాడిలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. అప్పుడప్పుడు
ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటారని, ఇది
ఖచ్చితంగా అలాంటి వారి పనే అయి
ఉంటుందని చెప్పారు.
తెలుగుదేశం
పార్టీ నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్
కార్యాలయంపై దాడి ఘటనపై ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే దాడి
చేసి తెలుగుదేశం పార్టీ పైన జూనియర్‌ను
రెచ్చగొట్టే విధంగా కుతంత్రాలకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. జూనియర్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను
అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు.
జూనియర్
ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి విషయమై తమకు
ఎలాంటి ఫిర్యాదు అందలేదని బంజారాహిల్స్ పోలీసులు ఉదయం చెప్పారు. ఈ
ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము స్పందిస్తామని, నిందితులను
పట్టుకుంటామని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఇండికా కారులో వచ్చి దాడి చేసినట్లుగా
తెలుస్తోందని, ఇది ఆకతాయిల పనే
అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా
ఫిల్మ్ నగర్‌లోని జూనియర్
ఎన్టీఆర్ కార్యాలయంపై బుధవారం రాత్రి పదకొండు గంటలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇండికా కారులో వచ్చి దాడి చేసిన
విషయం తెలిసిందే. అద్దాలు ద్వంసం అయ్యాయి. అయితే దాడి చేసిన
వారు కానీ, దానికి కారణాలు
కాని తెలియటం లేదు. జూనియర్ ఇక్కడ
నుంచే ఇంతకు ఒక రోజు
ముందు కొడాలి నాని విషయమై టీవీ
మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని వర్గీయలు కావచ్చని
కొందరు, తాగి వచ్చిన కొందరు
అయి ఉండవచ్చునని మరికొందరు ఊహిస్తున్నారు. అయితే అంతా సజావుగా
ఉన్న ఈ సమయంలో ఎవరు
దాడికి పాల్పడి ఉంటారనేది అర్దం కావటం లేదని
సీనియర్స్ అంటున్నారు.
0 comments:
Post a Comment