ప్రపంచంలోనే
అత్యంత చవకైన కారుగా చరిత్రకెక్కిన
'టాటా నానో' త్వరలోనే సవతిపోరు
రానుంది. జపాన్‌కు చెందిన
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ
హోండా మోటార్ కార్పోరేషన్ ఓ చవక కారును
అభివృద్ధి చేస్తోంది. తక్కువ సీసీ కలిగిన పెట్రోల్
ఇంజన్, ఎక్కువ మైలేజీనిచ్చే బుజ్జి కారును హోండా డెవలప్ చేస్తోంది.
ఇండియన్
మార్కెట్లో మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న
చిన్న కారు ఆల్టో, టాటా
మోటార్స్ చవక కారు టాటా
నానో మోడళ్లకు పోటీగా హోండా ఓ చిన్న
కారును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత మార్కెట్లో అధిక
మైలేజీనిచ్చే చిన్న కార్లకు డిమాండ్
జోరుగా ఉండటం, దీనికితోడు మారుతి సుజుకి మెరుగైన మైలేజీనిచ్చేలా కొత్త ఆల్టో 800 కారును,
అలాగే టాటా మోటార్స్ ఓ
డీజిల్ నానో కారును విడుదల
చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ప్రత్యేకించి మెరుగైన మైలేజీనిచ్చే పెట్రోల్ కార్లను తయారు చేయడంలో పాపులర్
అయిన హోండా 660సీసీ విటెక్ ఇంజన్‌ను కలిగిన ఓ
చిన్న కారును భారత మార్కెట్‌కు
పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
హోండా
ఎన్600 ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా
చేసుకొని అభివృద్ధి చెందుతున్న ఈ చిన్న కారు
133 ఇంచ్‌ల పొడవును 58 ఇంచ్‌ల వెడల్పును కలిగి
ఉండనుంది. ఇందులో ఉపయోగించిన 660సీసీ విటెక్ ఫోర్-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 64 హెచ్‌పిల శక్తిని విడుదల
చేయనుంది. ఇది టాటా నానో
పెట్రోల్ కారు విడుదల చేసే
శక్తి కన్నా సుమారు రెండు
రెట్లు అధికం. ఇక ఇండియాలో దీని
ధర విషయానికి వస్తే నానో, ఆల్టో
కార్ల ధరల శ్రేణిలోనే (సుమారు
రూ.2-3 లక్షలు) ఉండొచ్చని అంచనా.
గతేడాది
జరిగిన టోక్యో మోటార్ షోలో హోండా ఈ
తరహా కాన్సెప్ట్ కారును (హోండా ఎన్600) ప్రదర్శనకు
ఉంచింది. ప్రస్తుతం దీనిని ఆధారంగా చేసుకొని ఓ ప్రొడక్షన్ వెర్షన్‌కు హోండా మెరుగులు
దిద్దుతోంది. 2014 నాటికి ఇది పూర్తిస్థాయిలో ఉత్పత్తి
దశకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment