భారత్‌లో శరవేగంగా వృద్ధి
చెందుతున్న చిన్న కార్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ
జర్మనీకు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఓ చిన్న కారు
'ఫోక్స్‌వ్యాగన్ అప్'ను అభివృద్ధి
చేసిన సంగతి తెలిసిందే. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గత కొద్ది కాలంగా
ఈ చిన్న కారును ఇండియన్
రోడ్లపై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం
ఈ మోడల్ విడుదలకు సిద్ధమవోతుంది.
ఫోక్స్‌వ్యాగన్ అప్ ఇండియన్ మార్కెట్‌లో విడుదల కావాటానికి
అన్ని ఫార్మాలీటలను పూర్తి చేసుకుంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో
ఈ మోడల్ వాణిజ్య పరంగా భారత మార్కెట్లో
విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త 'ఫోక్స్‌వ్యాగన్ అప్' ధర రూ.3.5
లక్షల నుంచి రూ.4.5 లక్షల
ధర శ్రేణిలో ఉండొచ్చని అంచనా. ఫోక్స్‌వ్యాగన్ అప్ చిన్న కారు
ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో 3-డోర్ ఆప్షన్‌తో
అందుబాటులో ఉంది. అక్కడి మార్కెట్లో
ఇది మంచి సక్సెస్‌ను
సాధించింది.
పెట్రోల్
వెర్షన్‌లో లభ్యం కానున్న
ఫోక్స్‌వ్యాగన్ అప్‌లో 999సీసీ,
3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఇది గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద
74 బిహెచ్‌పిల శక్తిని, 3000-5000 ఆర్‌పిఎమ్
వద్ద 11.06 కెజిఎమ్‌ల టార్క్‌ను
ఉత్పత్తిని చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండి
ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ అప్ 3540 మి.మీ. పొడవును,
1640 మి.మీ. వెడల్పును, 1480 మి.మీ. ఎత్తును కలిగి
ఉండి 2420 మి.మీ. వీల్‌బేస్, 251 లీటర్ల బూట్‌స్పేస్‌ను
కలిగి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ అప్ గురించి ఎప్పటికప్పుడు
తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్
స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
0 comments:
Post a Comment