అల్లు అర్జున్-త్రివిక్రమ్
కాంబినేషన్లో రూపొందుతున్న ‘జులాయి' చిత్రాన్ని తొలుత జులై 13న విడుల చేయాలని నిర్ణయించి
అనంతరం ....ఆగస్టుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వాయిదా పడటానికి కారణం
‘ఈగ' చిత్రం జోరు తట్టుకోలేకే అని ప్రచారం జరిగింది.
తాజాగా
ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న
వార్తల ప్రకారం అసలు రీజన్ అది
కాదని, ఈచిత్రంలోని కొన్ని సీన్లను రీషూట్ చేయడానికే సినిమాను ఆగస్టుకు వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన
అల్లు అరవింద్ బన్ని చేసిన కొన్ని
సీన్లపై అసంతృప్తిగా ఉన్నారని, వాటిని మళ్లీ రీ షూట్
చేయమని దర్శకుడు త్రివిక్రమ్‌ను కోరడంతో సినిమాను
వేయిదా వేసి మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు
రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో ఐటం సాంగు లేని
లోటు బాగా ఉండటంతో దాన్ని
కూడా యాడ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు
తెలుస్తోంది.
అయితే
అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ వార్తలను కొట్టి
పారేస్తున్నాయి. అలాంటిదేమీ లేదని, షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.
అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో
రూపొందిన జులాయి చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ
చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్:
ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక
అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ,
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం:
త్రివిక్రమ్ శ్రీనివాస్.
0 comments:
Post a Comment