హైదరాబాద్:
తాను ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు
డైరెక్టర్‌నో, చైర్మన్‌నో
కాదని కడప పార్లమెంటు సభ్యుడు,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్‌లోకి
హవాలా ద్వారా పెట్టుబడులు వచ్చాయని, దీనిపై జైలులో ఉన్న జగన్‌ను
ప్రశ్నించేందుకు తమకు అనుమతివ్వాలని ఈడి
ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై
జగన్ సోమవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో
కౌంటర్ దాఖలు చేశారు. తాను
జగతికి డైరెక్టర్‌గా గానీ, చైర్మన్‌గా గానీ లేనని
అలాంటప్పుడు తనను విచారించేందుకు ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్)కు అనుమతించవద్దని ఆయన
తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈడి
దాఖలు చేసిన పిటిషన్ మెయింటెనబుల్
కాదని కోర్టుకు తెలిపారు. తాను ప్రస్తుతం జైలులో
ఉన్నానని తనకు కంపెనీ వ్యవహారాలు
ఏమీ తెలియవని, తనకు ఫెమా, పిఎంఎల్
చట్టం వర్తించదని చెప్పారు.
జగన్
కౌంటర్ దాఖలు చేసిన తర్వాత
ఈడి అధికారులు తమకు కొంత సమయం
కావాలని కోరారు. మరికొద్దిసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి. జగన్ తరఫున అశోక్
రెడ్డి, ఈడి తరఫున సుభాష్
అనే న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.
కాగా పదిహేను రోజుల క్రితం జగన్‌ను విచారించేందుకు తమకు
అనుమతించాలని ఈడి పిటిషన్ దాఖలు
చేసిన విషయం తెలిసిందే.
ఈడి పిటిషన్ స్వీకరించిన నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు
జగన్‌కు నోటీసులు జారీ
చేసింది. ఈడి పిటిషన్ పై
కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
గత నెల 28న ఈ
పిటిషన్ విచారణఖు వచ్చింది. జగన్‌కు నోటీసులు
జారీ చేసిన అనంతరం విచారణనను
జూలై 2కు వాయిదా వేసింది.
0 comments:
Post a Comment