కర్నూలు/హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన యాదగిరిని ఎసిబి అధికారులు అరెస్టు
చేశారు. ఎసిబి అతనిని ఆదివారం
రాత్రి కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకుంది. ఆయన ఇచ్చిన సమాచారం
మేరకు హైదరాబాదులోని నాచారంలోని ఆయన ఇంట్లో అధికారులు
సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో నుండి
రూ.2.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎసిబి
అధికారులు యాదగిరిని రహస్య ప్రదేశంలో ఉండి
విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నుండి కీలక
సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన నుండి సేకరించిన
వివరాలతో మరికొందరి అరెస్టులకు ఎసిబి రంగం సిద్ధం
చేసే అవకాశముందని అంటున్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాలలో కూడా
యాదగిరి చెప్పిన వివరాల ప్రకారం సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా
గాలి బెయిల్ స్కాం కేసులో తాజాగా
ప్రభాకర రావు అనే జడ్జి
పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. గాలి
జనార్దన రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జ్యుడీషియల్ ఆఫీసర్
(జిల్లా జడ్జి హోదా)గా
పని చేస్తున్న ప్రభాకర్ రావు కూడా బేరం
పెట్టినట్లు తేలింది. ఎసిబి అధికారులు అరెస్టు
చేసిన పట్టాభిరామా రావు కుమారుడు రవిచంద్ర,
రిటైర్డ్ జడ్జి చలపతిరావుల నేరాంగీకార
పత్రంలో... బెయిల్ స్కామ్ గురించిన పూర్తి వివరాలు పూసగుచ్చినట్లున్నాయి.
ఇప్పటికే
ఎసిబి అధికారులు పట్టాభిరామ రావును, ఆయన తనయుడు రవిచంద్రను
అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పట్టాభి రామారావును కోర్టు రెండు రోజుల ఎసిబి
కస్టడీకి అప్పగించింది. ఎసిపి ఈ బెయిల్
విషయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తోంది. వారి వాంగ్మూలాలు తీసుకుంటోంది.
0 comments:
Post a Comment