హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్
చైర్మన్ విజయ సాయి రెడ్డిలు
అక్రమాస్తుల కేసులో కీలక నిందితులు అని
సిబిఐ తరఫు న్యాయవాది బుధవారం
నాంపల్లి ప్రత్యేక కోర్టులో వాదించారు. జగన్‌కు నార్కో
పరీక్షలు జరిపేందుకు అనుమతించాలని సిబిఐ కోర్టులో పిటిషన్
దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై బుధవారం ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. అనంతరం కోర్టు తీర్పును 16వ తేదికి వాయిదా
వేసింది.
ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది
మొదట తన వాదనలు వినిపించారు.
ఆస్తుల కేసులో జగన్, విజయ సాయి
రెడ్డిలు కీలక నిందితులు అని
చెప్పారు. గతంలో వారిని విచారించినప్పుడు
సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. అందుకే వారని నార్కో పరీక్షలకు
అనుమతించాలని కోరుతున్నామని చెప్పారు. నార్కోకు అనుమతిస్తే జగన్, విజయ సాయి
రెడ్డిలపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు.
ప్రశ్నించేటప్పుడు
డాక్టర్ తప్ప ఎవరూ ఉండని
తెలిపారు. ఇది మానవ హక్కుల
ఉల్లంఘన ఏమాత్రం కాదని చెప్పారు. నార్కో
పరీక్షల ద్వారా వచ్చిన సమాచారంతో ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. జగన్, విజయ సాయి
రెడ్డిలు తాము అమాయకులమని చెబుతున్నారని
అన్నారు. నార్కో టెస్టులకు సహకరించి వారి నిజాయితీని నిరూపించుకోవాలని
సిబిఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
అనంతరం
జగన్ తరఫు న్యాయవాది తన
వాదనలు వినిపించారు. నిందితుల అనుమతి లేకుండా నార్కో టెస్టుకు అనుమతి ఇవ్వవద్దని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ సిబిఐ పదే పదే
అడుగుతోందని అన్నారు. విచారణకు జగన్, సాయి రెడ్డిలు
పూర్తిగా సహకరించారని చెప్పారు. నార్కో వల్ల కొన్ని సందర్భాలలో
నిందితులు కోమాలోకి వెళ్లే ప్రమాదముందన్నారు. వారి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.
నిందితుడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశముందన్నారు. ఇప్పటికే సాయి రెడ్డికి నార్కో
పరీక్షలు వద్దంటూ కోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు.
0 comments:
Post a Comment