హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు,
తెలంగాణ నగారా సమితి చైర్మన్,
నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి
మధ్య సోమవారం సచివాలయంలో ఆసక్తిక చర్చ జరిగింది. సచివాలయంలో
వద్ద నాగం, గాలి ఎదురు
పడ్డారు. ఈ సందర్భంగా గాలి..
నాగంను పలకరించారు. ఏ పార్టీలో చేరావని
ప్రశ్నించారు. ఏదో పార్టీ పెడుతున్నట్లుగా
విన్నానని గాలి అడిగారు.
అందుకు
నాగం స్పందిస్తూ.. తన పార్టీ సంగతి,
తన సంగతి సరేనని, తెలంగాణలో
తెలుగుదేశం పార్టీ సంగతి మొదట చూసుకోండని
చెప్పారు. ఉప ఎన్నికలలో డిపాజిట్లు
కూడా దక్కించుకోలేక పోయిందని గాలికి సమాధానమిచ్చారు. అయితే గాలి కూడా
ధీటుగానే స్పందించారు. వచ్చే సాధారణ ఎన్నికలలో
తమ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని, మళ్లీ తమ పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడే
ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
అందుకు
ప్రతిగా.. మీవన్నీ పగటి కలలని, వాటి
నుండి బయట పడాలని గాలికి
నాగం సూచించారు. అసలు నీకే దిక్కులేదని,
మళ్లీ గెలుస్తావో చూసుకొమ్మని, ఇటీవల జరిగిన ఎన్నికలలో
ఏదో తెలంగాణ సెంటిమెంట్ బలం పైన గెలిచావని
గాలి కౌంటర్ ఇచ్చారు. అయితే మనం ఇప్పుడే
ఇక్కడే డిబేట్ పెట్టుకుందామని నాగం సవాల్ చేయగా....
ఇప్పుడు కాదు, ఎల్బీ స్టేడియంలో
డిబేట్ పెట్టుకుందామని, అక్కడ తేల్చుకుందామని గాలి
సమాధానమిచ్చారు.
ఈసారి
మేం మా జిల్లాలో పది
సీట్లు గెలుస్తామని నాగం అనగా నీకు
పార్టీయే లేదు, నువ్వేం గెలుస్తావని
గాలి ఎద్దేవా చేశారు. ఎలా గెలుస్తామో చూస్తారుగా
అని నాగం సమాధానమిచ్చారు. టిడిపిలో
ఉన్నప్పుడు నీవు దివంగత వైయస్
రాజశేఖర రెడ్డి సర్కారుపై మాట్లాడిన విషయాలను బయటపెడితే చాలు, ఆ వ్యాఖ్యలు
మా పార్టీ అధికారంలోకి దోహదపడతాయని గాలి చెప్పగా, అసెంబ్లీలో
తాను చేసిన ఆరోపణలలో నిజముందని
నాగం చెప్పారు.
కాగా
తాము రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థి పిఏ సంగ్మాకే మద్దతు
ఇస్తామని నాగం జనార్ధన్ రెడ్డి
స్పష్టం చేశారు. తనతో పాటు తన
వెంట ఉన్న ఎమ్మెల్యేలు హరీశ్వర్
రెడ్డి, వేణుగోపాల చారి కూడా సంగ్మాకే
ఓటేస్తారని చెప్పారు. తెలంగాణపై తేల్చని యుపిఏ పార్టీ అభ్యర్థికి
ఓటు వేయమని చెప్పారు.
మరోవైపు
కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ కాస్తా
అంధకార ప్రదేశ్‌గా మారిపోయిందని గాలి
ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ సక్రమంగా
విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు.
విద్యుత్తు లేక పంటలు ఎండిపోయి
రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని,
ఉపాధి లభించక కూలీలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment