పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం
తెలుగు హీరోల్లో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు
చేరి పోయారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ
విజయం సాధించడమే ఇందుకు కారణం. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలంటే
ప్రేక్షకుల్లో మహా క్రేజ్ ఉంటుంది.
గత పదేళ్లుగా హిట్లు, ప్లాపులు అనే తేడా లేకుండా
పవన్ సినిమాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మినిమమ్ లాభాలు తెచ్చేవిగా ఉంటున్నాయి. మరి ఆ రేంజిలో
మార్కెట్ ఉండే పవన్‌ని
‘గబ్బర్ సింగ్' చిత్రం ఎవరూ అందుకోలేనంత హైట్స్‌కి తీసుకెళ్లింది.
గబ్బర్
సింగ్ చిత్రం రూ. 100 కోట్లకుపైగా మార్కెట్ చేయడంతో
పవన్ చిత్రాల మార్కెట్ విలువ కూడా అమాంతం
పెరిగి పోయింది. గబ్బర్ సింగ్ చిత్రం ఓవర్సీస్
రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడు
పోతే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం
కెమెరామెన్ గంగతో రాంబాబు ఓవర్సీస్
రైట్స్ దాపుకు అందుకు రెంట్టిపు ధర పలికాయి. అదే
విధంగా గబ్బర్ సింగ్ చిత్రం నైజాంలో
రూ. 20 కోట్ల షేర్ సాధించడంతో
కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం
హక్కులు 13 కోట్లకు పైగా చెల్లించి దక్కించుకునేందుకు
దిల్ రాజు ట్రై చేస్తున్నట్లు
తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని
కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం
విడుదలకు ముందే దాదాపు 50 కోట్ల
వ్యాపారాన్ని రీచ్ అయ్యే అవకాశం
ఉందనే ఊహాగానాలు ట్రేడ్ వర్గాల నుంచి వినినిస్తున్నాయి. కనీసం
30 కోట్లైనా వస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఆ అంచనాలు నిజమైతే.... పవర్ స్టార్ టాలీవుడ్
చరిత్రలో మరిచిపోలేని మరో మైలు రాయిని
పాతడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో
అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు.
అయితే పవన్ రికార్డులు బీట్
చేసేందుకు ఇతర హీరోలు కూడా
పక్కా ప్లాన్ తో రెడీ అవుతుండటం
గమనార్హం.
0 comments:
Post a Comment