హైదరాబాద్:
మాజీ కేంద్రమంత్రి, రాష్ట్రపతి రేసులో ఉన్న ప్రణబ్ ముఖర్జీ
దేశానికి ఎన్నో ఏళ్లు తన
సేవలు అందించారని, అలాంటి నేత తనయుడు ఇప్పుడు
సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని విజయవాడ పార్లమెంటు
సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు లగడపాటి
సమాధానమిచ్చారు.
జగన్
అక్రమాలతో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవినే
తృణపాయంగా వదులుకున్నారని చెప్పారు. అవినీతిపరులు ఎంతటివారలైనా శిక్షార్హులే అని ఆయన అన్నారు.
అవినీతిని ఒక్కరోజులో అంతమొందించడం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమాలు
చేసిన వారు దొరికినప్పుడు కఠినంగా
శిక్షిస్తే అక్రమాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు.
ఎన్నికలను
డబ్బు ప్రభావితం చేయలేదని చెప్పారు. తప్పు చేసిన వారు
అంత తొందరగా దొరకరని చెప్పారు. జగన్ అక్రమాలు ఇప్పుడే
వెలుగులోకి వచ్చాయని, ఆయన తండ్రి ఉన్నప్పుడు
వెలుగులోకి రాలేదని చెప్పారు. కాంగ్రెసుకు ఎవరిమీదా కక్ష సాధించాల్సిన అవసరం
లేదన్నారు. అందుకు మంచి ఉదాహరణ యుపిఏ
భాగస్వామ్య పక్షమైన డిఎంకే అధినేత కరుణానిధి తనయ, ఆ పార్టీ
ఎంపి కనిమొళి అరెస్టే అన్నారు.
అధికారంలో
ఎక్కడో ఒకచోట అవినీతి ఉంటుందని
చెప్పారు. తాను రాజకీయాలలోకి రాకముందే
వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించానని,
ఇప్పుడు డబ్బు అవసరం తనకు
అంతగా లేదని, రాజకీయాలలో అక్రమాలతో సంపాదించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు.
తన తమ్ముడు లగడపాటి శ్రీధర్ ఎప్పటి నుండో జగన్ కంపెనీలలో
పెట్టుబడులు పెడుతున్నారని, ఆర్థికంగా వారి కుటుంబాన్ని ఆదుకున్నారని,
అలాంటి తన తమ్ముడి పైనా
వారు విమర్శలు చేయడం శోచనీయమన్నారు.
0 comments:
Post a Comment