హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి
ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కితాబిచ్చారు. హ్యూమనిటీస్ వ్యాల్యూస్ పరంగా వైయస్ రాజశేఖర
రెడ్డి బెస్ట్ అని రాధాకృష్ణ అన్నారు.
అభివృద్ధి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
ఆయన ఓటు వేశారు. ఇక
అవినీతి విషయంలోనూ ఆయన బాబు బెస్ట్
అన్నారు. ఇద్దరి అవినీతి విషయంపై స్పందిస్తూ.. బాబు బెటర్ దేన్
వైయస్ రాజశేఖర రెడ్డి అని తన అభిప్రాయం
వ్యక్తం చేశారు.
ఆదివారం
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా
రాధాకృష్ణ పై విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ప్రశ్నలకు
స్పందిస్తూ... ప్రస్తుత పరిస్థితులలో యువత ఆదర్శంగా తీసుకుంటున్న
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, జాతి పిత
మహాత్మా గాంధీలు వచ్చి ఎన్నికలలో పోటీ
చేసినా గెలవలేరని, డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు.
అవినీతి,
అక్రమార్కులను రోల్ మోడల్‌గా
తీసుకోవడం సరికాదని ఆయన యువతకు హితవు
పలికారు. చరిత్రను తరిచి చూస్తే భారీగా
అవినీతికి పాల్పడ్డ వారెవరూ శిక్ష నుండి తప్పించుకోలేక
పోయారని, వారి అంతిమ జీవితం
జైలులోనే గడుస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడ్డ ఇండోనేషియా అధ్యక్షుడిని దేశం నుండి తరిమేశారని,
ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో కూడా
తెలియదన్నారు.
గడాఫీ,
ముబారక్, సద్దాం హుస్సేన్ ప్రపంచంలో ఎవరినీ తీసుకున్నా అలాగే ఉందన్నారు. ఎంత
అవినీతికి పాల్పడితే అంత గొప్ప అనుకోవద్దని
ఆయన యువతకు మార్గానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలలో విజయవాడ
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment