విశాఖపట్నం:
తమ పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుందని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం
అన్నారు. ఆదివారం తన కూతురు షర్మిలతో
కలిసి విజయమ్మ విశాఖపట్నం జిల్లాలోని తిక్కవానిపాలెంలో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా విజయమ్మ
మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు.
పదిహేను
రోజులలోగా న్యాయం జరిగేలా చూడాలని ఎన్‌టిపిసి యాజమాన్యాన్ని
డిమాండ్ చేశారు. ఎన్‌టిపిసి వల్ల
మత్స్యకారులు బాధలు పడుతున్నారని అన్నారు.
వారు బాధితులుగా మారారని అన్నారు. కాబట్టి వారికి న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. తమ పార్టీ ప్రజల
పక్షాన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆమె
ఎన్‌టిపిసి జనరల్ మేనేజర్‌తో
మధ్యాహ్నం భేటీ ఉపాధి చేపట్టాలని
సూచించారు.
మత్స్యకార్మికులకు
ఉపాధి కల్పించకుంటే తమ పార్టీ ఆందోళన
బాట పట్టాల్సి ఉంటుందని చెప్పారు. పలువురు మత్స్యకారులు విజయమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు.
మత్స్యకారుల కష్టాలు తీరే వరకు వైయస్సార్
కాంగ్రెసు వారి వెన్నంటే ఉంటుందని
షర్మిల అన్నారు. ప్రాజెక్టు వల్ల వారికి ఇబ్బందులు
ఏర్పడుతున్నాయని, అలాగని ప్రాజెక్టు వచ్చాక ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదన్నారు.
అంతకుముందు
విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన విజయమ్మకు, షర్మిలకు
పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
తిక్కవానిపాలంలో పరామర్శ అనంతరం వారు విశాఖపట్నం నుండి
హైదరాబాద్ బయలుదేరారు.
0 comments:
Post a Comment