హైదరాబాద్:
స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డి(పిజెఆర్) తనయుడు, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి
మంగళవారం మంత్రి గల్లా అరుణ కుమారిని
వైఖరిపై మండిపడ్డారు. జిహెచ్ఎంసి(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) అధికారులు షేక్‌పేట నాలా
దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలను
కూల్చి వేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన
స్థానిక ఎమ్మెల్యే విష్ణు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
జిహెచ్ఎంసి
అధికారులపై మండిపడ్డారు. వారికి వార్నింగ్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల పేరిట
పేదల ఇళ్లు కూల్చివేస్తే ఊరుకునే
ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
అధికారులు పేదలపై తమ ప్రతాపం చూపించడం
కాదని, అక్రమార్కులైన పెద్దలపై చూపించాలని సూచించారు. భవనాలను కూల్చి వేయడానికి వచ్చిన అధికారులను విష్ణు అక్కడ నుండి వెళ్లగొట్టారు.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడారు.
ఇక్కడి
పేద ప్రజలకు ఈ దుకాణాలే ఆధారమని,
వీటిని కూల్చివేస్తే వారు ఎక్కడకు వెళ్తారని
ఆయన ప్రశ్నించారు. వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కూల్చి వేసుకోవచ్చునని చెప్పారు. హైదరాబాదులో పేదోడు బతకాలంటేనే కష్టంగా ఉందన్నారు. గల్లా అరుణ కుమారి,
జవహర్ రెడ్డిల కుట్ర కారణంగానే ఈ
కూల్చివేత యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గల్లా, జవహర్ రెడ్డిల కార్లు
వెళ్లేందుకు పేదల ఇళ్లు కూల్చాలనే
వారి బుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు.
ఇళ్లు
కూల్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కాగా విష్ణువర్ధన్ రెడ్డి
అడ్డు చెప్పడంతో అధికారులు అక్కడ నుండి వెనుదిరిగారు.
కాగా విష్ణువర్ధన్ రెడ్డి గతంలోను పలుమార్లు పేదల ఇళ్లు కూల్చేందుకు
ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్నారు.
0 comments:
Post a Comment