చాలామంది సాధారణంగా కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదంటారు. దీనికి కారణం బహుశ అందులో వుండే, కెఫైన్
అనే మత్తు పదార్ధం అయివుండవచ్చు. కాఫీ అధికంగా తాగితే అనారోగ్యమే. కేఫైన్ నిద్రను తగ్గిస్తుంది.
శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కనుక, కాఫీ తక్కువ తాగాలి. అయితే, వేడి వేడి ఈ కాఫీ పానీయం వెనుక
కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. కనుక అసలు కాఫీ ఎందుకు తాగాలనేది పరిశీలిద్దాం.
కాఫీ
తాగటం ఎందుకు వదిలేయరాదు?
కాఫీ
గుండెకు మంచిది. చాలామంది రీసెర్చర్లు, తగు మాత్రంగా అంటే
రోజుకు ఒకటి లేదా రెండు
కప్పులు కాఫీ తీసుకుంటే గుండెకు
ఆరోగ్యం అని చెపుతారు. కాఫీ
గుండె సంబంధిత వ్యాధులు అరికడుతుంది. కాఫీలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు
రక్తనాళాలలో మంటలను అరికట్టి రక్త సరఫరా మెరుగుపరుస్తాయి.
కాఫీ తాగిన వెంటనే మీలో
రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు
పెరుగుతాయి. అయితే దీర్ఘకాలంలో మీ
ఈ స్ధాయిలు యాంటీ ఆక్సిడెంట్లలో వున్న
నైట్రిక్ యాసిడ్ కారణంగా నియంత్రించబడతాయి.
తలనొప్పి
తగ్గిస్తుంది - తలనొప్పి అధికంగా వుందా? వేడి వేడి కాఫీ
ఒక కప్పు తాగండి. అందులో
కొద్దిగా క్రీమ్ కూడా కలిపి ప్రతి
సిప్ ఆనందించండి. మరి ఇంత మేలు
చేసే కాఫీ ఎందుకు వదలాలి?
ఎపుడైనా మీకు బద్ధకం లేదా
తలనొప్పి వుంటే, దానికి జవాబు ఒక కప్పు
కాఫీ మాత్రమే. కాఫీలో వుండే కేఫైన్ కనుక
మెదడుకు చేరితే, మీరు చాలా చురుకైపోతారు.
మీ తలనొప్పి నియంత్రించబడుతుంది. ఎందుకంటే, కేఫైన్ మీ బ్రెయిన్ సెల్స్
ని చురుకు పుట్టించి బద్ధకాన్ని పారద్రోలుతుంది.
నిద్రను
కూడా నియంత్రిస్తుంది - రాత్రిపూట లేట్ గా పని
చేసుకోవాలి. కాని నిద్ర ముంచుకు
వచ్చేస్తూంటుంది. అటువంటపుడు ఒక కప్పు కాఫీ
తాగేయండి. మీ మైండ్ ఎంతో
అలర్ట్ అయిపోతుంది. దీనికి కారణం కేఫైన్. కొద్ది
గంటలవరకు నిద్ర పోరాదంటే ఒక
కప్పు కాఫీ చాలు. మీరు
రాత్రివేళ నిద్ర ఆపుకుంటూ ఎంత
చదవాలనుకున్నా లేదా పనులు చేసుకోవాలన్నా,
రెండు కప్పుల కాఫీకి మించి తాగకండి.
జ్ఞాపక
శక్తి బలపరుస్తుంది - మీ మెమొరీ పవర్
పెరగాలని ఉందా? ప్రతిరోజూ ఒకటి
లేదా రెండు కప్పులు కాఫీ
తాగండి. కేఫైన్ అల్జీమర్స్ మరియు పార్కిన్ సన్
వంటి వ్యాధులకు కూడా పరిష్కారం. కాఫీలో
వుండే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూరో
ట్రాన్స్ మిటర్లపై బాగా పనిచేస్తాయి.
ప్రొస్టేట్
కేన్సర్ నివారణ - పురుష ప్రొస్టేట్ గ్రంధిలో
వచ్చే ఒక కేన్సర్ ను
ప్రొస్టేట్ కేనన్సర్ అంటారు. కాఫీ కేఫైన్ తో
తాగినే కేఫైన్ లేకుండా తాగినా సరే అది పురుషులలోని
ప్రొస్టేట్ కేన్సర్ ను నివారిస్తుంది. కాఫీలో
యాంటీ ఆక్సిడెంట్లు మరియు మంట కలిగించని
గుణాలు వుండి శరీరంలో వివిధ
మంటలనను తగ్గించి ఉపశమనమిస్తుంది. కనుక పురుషులు రోజుకు
కనీసం ఒక కప్పు కాఫీ
అయినా తాగాలి.
మరి కాఫీ ఎందుకు మానేయ
రాదు? అనేదానికి ఈ కారణాలు మీకు
చాలు. ఈ పానీయం ఇచ్చే
ఈ కొద్దిపాటి ఆరోగ్య ప్రయోజనాలు మీకు ఎంతో మేలు
చేస్తాయి. అయితే, కాఫీ అధికంగా తాగితే,
ఆరోగ్యానికి హాని అని గుర్తించండి.
దానిని నియంత్రించండి.
0 comments:
Post a Comment