హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఇటీవల
ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు
కృష్ణమ నాయుడు శనివారం ఆరోపించారు. వైయస్ విజయమ్మ సోనియా
గాంధీతో రహస్యంగా సమావేశమయ్యారని ఎకనామిక్స్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన వార్త యదార్థమని ఆయన
అన్నారు.
ఈ భేటీ తర్వాతే జగన్
పార్టీ లొంగిపోయిందని, రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేసిందని ఆరోపించారు.
ఈ భేటీ జరిగినట్లు వచ్చిన
వార్తలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి మొక్కుబడిగా
ఖండించారని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన
వెంటనే తన కొడుకు జగన్
జైలు నుంచి త్వరలోనే బయటకు
వస్తాడని విజయమ్మ చెప్పారన్నారు.
దివంగత
వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మలో ఆత్మ ఐన రాజ్యసభ
సభ్యుడు కెవిపి రామచంద్ర రావు కూడా ఉన్నట్లుండి
ఇప్పుడు ఆకస్మికంగా వైయస్ ఫొటో ఏదని
అడుగుతున్నారని, ఇది ఇరు పార్టీల
పెద్ద నాటకమని ఆయన అన్నారు. జగన్
కేసుల్లో ఇరుక్కొన్న మంత్రులకు న్యాయ సహాయం చేయాలని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
నిర్ణయించడం కూడా ఈ ఒప్పందంలో
భాగమే అన్నారు.
తెలుగుదేశం
పార్టీని అడ్డుకొనే కుట్రలో భాగంగా ఈ రెండు పార్టీలు
ఒక వ్యూహం ప్రకారం పని చేస్తున్నాయని, నాలుగు
రోజులాగి జగన్‌ను జైలు
నుంచి బయటకు తీసుకురావడం తథ్యమని
అన్నారు. వైయస్ హయాంలో ముడుపులు
అందుకొన్న నేరానికి సోనియా కూడా ఏదో ఒక
రోజు జైలు పాలు కావాల్సి
వస్తుందని వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment