వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ములాకత్‌లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బదిలీకి దారి తీసిందనే వార్తలు వస్తున్నాయి! జైలు సూపరింటెండెంట్ కేశవ నాయుడు బదలీ దాదాపు ఖరారైందని సమాచారం. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్‌కు, ఓఎంసి కేసులో అరెస్టై జైలులో గడిపిన గాలికి ములాకత్‌ల విషయంలో ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అతనిపై బదలీ జరిగినట్లుగా సమాచారం. కేశవ నాయుడును సికా ప్రిన్సిపాల్‌గా, వరంగల్ జైలు సూపరింటెండెంట్ సైదయ్యను చంచల్‌గూడ సూపరిటెండెంట్‌గా, సికా ప్రిన్సిపాల్ ఉమాపతిని వరంగల్ జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే... ఈ మేరకు ఉత్తర్వులు సిద్ధమై వారం రోజులు కావస్తున్నా... రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పెండింగ్ పెట్టినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో విఐపిల ములాఖత్‌ల విషయంలో ఎస్‌బి, ఇంటలిజెన్స్ విచారణ చేపట్టి హోంశాఖకు నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో హోంశాఖ బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు జైళ్ళశాఖ డైరెక్టర్ జనరల్(డిజి)కి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.

0 comments:
Post a Comment