హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనలో జాప్యంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిని నిందించారు. పురంధేశ్వరి వల్లనే ఎన్టీఆర్ విగ్రహ స్థాపనలో జాప్యం జరుగుతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. విగ్రహ స్థాపనపై తమ పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా నడుస్తోందని వెల్లడించిన ఎన్డిటివీ సర్వేపై ఆయన గుర్రుమన్నారు. వైయస్ జగన్‌కు అనుకూలంగా ఓ టీవీ చానెల్ సర్వే నిర్వహించిందని ఆయన అన్నారు. సర్వే చేసిన చానెల్ జగన్ మీడియాకు కన్సల్టెన్సీ అని వింటున్నామని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనలను రాజకీయం చేయడం దారుణమని ఆయన అన్నారు.
విద్యుచ్ఛక్తి రంగంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దానికి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి వచ్చిన డబ్బంతా గనుల ద్వారా వచ్చిందేనని ఆయన అన్నారు. అడ్డంగా దోచుకునేందుకు ఖనిజ సంపద, సెజ్‌లను మార్గాలుగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.
పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ తీరును తప్పు పట్టారు. అదే విధంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి చంద్రబాబు విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. వైయస్ జగన్‌ను మెజారిటీ ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఎన్డీటివీ తన సర్వేలో తేల్చింది. వీటన్నింటిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు మంగళవారంనాటి మీడియా సమావేశంలో ప్రతిస్పందించారు.

0 comments:
Post a Comment