హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన తప్పు వల్లే పార్లమెంటులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజుల విగ్రహాలను నెలకొల్పే వ్యవహారంలో వివాదం చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు లోపల కేవలం రెండే విగ్రహాలు పెట్టడానికి ఖాళీ మిగిలినప్పుడు సంబంధిత కమిటీలో సభ్యుడిగా ఉన్న టిడిపి పార్లమెంటు సభ్యులు ఎర్రన్నాయుడు ఈ రెండు పేర్లు ప్రతిపాదించి ఆమోదింప చేశారని చెప్పారు.
అప్పటి సిఎం వైయస్ రాజకీయ ద్వేషంతో ఆ విగ్రహాలు ఇవ్వక పోగా దానిని వ్యతిరేకించారన్నారు. స్పీకర్ చాలాకాలం చూసి మమ్మల్ని అడిగారని, విగ్రహాలు ఇవ్వడానికి మేం అంగీకరించి.. పార్లమెంటు నిబంధనల ప్రకారం నమూనాలు పంపి ఆమోదం తీసుకున్నామని, ఈ దశలో కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి జోక్యం చేసుకొని ఎన్టీఆర్ కూతురుగా తాను ఇస్తానని స్పీకర్‌కు లేఖ రాశారని చెప్పారు. దాంతో వివాదం మొదలైందని చెప్పారు.
పార్టీ, కుటుంబం రెండింటి తరపునా విగ్రహాలు ఇస్తామని అందరం సంతకాలు పెట్టి స్పీకర్‌కు లేఖ ఇచ్చామని, దానిపై ఆమె సంతకం పెడితే వివాదం సమసిపోయేదని, కానీ పెట్టలేదన్నారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పీకర్‌కు లేఖ రాయడం వల్లే పార్లమెంట్‌లో ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు ఆలస్యమవుతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదంపై ఆయన మంగళవారం వివరణిచ్చారు.
ఏది ఏమైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఆయన విగ్రహాన్ని పార్లమెంట్‌కు ఇవ్వాలన్న నిర్ణయంతో సమస్యకు తెరపడిందన్నారు. పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా తన సమ్మతిని తెలియజేస్తూ స్పీకర్‌కు లేఖ రాస్తే సమస్య పూర్తిగా తొలిగిపోయి విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని, రాజకీయాలు ఎవరు చేస్తున్నారో టిడిపి పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు.

0 comments:
Post a Comment