రాజమండ్రి/హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని
పన్నెండు సంవత్సరాలు వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో పెడితే ఇపుడు ఆయన కుమారుడు
జగన్ అదే కాంగ్రెస్‌పై
తిరుగుబాటు చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
పన్నెండేళ్లు కాంగ్రెస్‌లో వైయస్ రాజశేఖర
రెడ్డి మాటే చెల్లిందని ఆయన
మరణించడంతో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంలో ఇబ్బంది తలెత్తుతున్నదని ఆయన అన్నారు.
వైయస్‌కు ఆనాడు, ఈనాడు
కూడా కాంగ్రెస్‌లో వ్యతిరేకులు ఉన్నారని,
వారే ఇప్పటికీ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్‌ని అవమానించేవిధంగా మా
ట్లాడితే తమ లాంటివారికి బాధ
కలుగుతుందని చెప్పారు.
యువజన
కాంగ్రెస్ కార్యక్రమంలో వైయస్ ఫొటో లేదంటూ రాజ్యసభ
సభ్యుడు చేసిన వ్యాఖ్యల్లో పెద్దగా
ఆశ్చర్యపోయేదేమీ లేదని మాజీ మంత్రి,
ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి
అన్నారు. కేవీపీ, వైఎస్.. ఆత్మ- పరమాత్మ కాబట్టి
ఆయన అలాంటి వ్యాఖ్యలు ఆశ్చర్యమనిపించలేదన్నారు. వైయస్ ఫొటో ప్రాధాన్యాన్ని తగ్గించాలంటూ
మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికను
గుర్తు చేయగా.. ఇలాంటి విషయాలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, వాటిని తాము పాటిస్తామని చెప్పారు.
యువజన
కాంగ్రెస్ ప్రమాణ స్వీకార సభలో కెవిపి రామచంద్రరావు
వైయస్ పేరును ప్రస్తావించిన తీరు పట్ల కాంగ్రెస్
అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అభ్యంతరం వెలిబుచ్చారు.
మరి అంజయ్య వంటి మాజీ సీఎం
కేవీపీకి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. యువజన
కాంగ్రెస్ సమావేశంలో వైఎస్ ఫోటో గురించి ప్రస్తావించడం
విచిత్రమన్నారు.
0 comments:
Post a Comment