హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి నెం.1 అని నిరూపించుకున్నాడు. అత్యధిక కార్పొరెట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ నెం.1 పొజిసన్లో ఉన్న మహేష్ బాబు ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా'వారు మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు గాను మహేష్ బాబుతో రూ. 4 కోట్ల డీల్ కుదుర్చుకుందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా మహేష్ బాబు రేంజిలో యాడ్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించడం లేదు. ఇటు కమర్షియల్ యాడ్లలో...మరో వైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా కొనసాగుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు.

0 comments:
Post a Comment