చిత్తూరు: తన తండ్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని నారా లోకేష్ బుధవారం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ తొలిసారి రాజకీయాలపై స్పందించారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. తాను పార్టీలో సాధారణ కార్యకర్తలాగే కొనసాగుతానని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ఢీకొట్టే సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. మిగతా పార్టీలకు ఆ సత్తా లేదన్నారు. బెదిరింపు రాజకీయాలకు టిడిపి భయపడదన్నారు. ఇతర పార్టీలు ప్రజారాజ్యం పార్టీలాగా కాంగ్రెసు పార్టీలో విలీనం కావాల్సిందేనని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. అయితే జగన్ పార్టీపై విలేకరి నేరుగా ప్రశ్నించగా వేరే పార్టీల గురించి తాను మాట్లాడనన్నారు. కాగా నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై చాలారోజులుగా తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
యువతను ఆకర్షించేందుకు పార్టీలోకి లోకేష్‌ను తీసుకు రావాలని తెలుగు తమ్ముళ్లూ కూడా చంద్రబాబుపై కొంతకాలంగా ఒత్తిడి తీసుకు వస్తున్నారు. లోకేష్ ఆరంగేట్రానికి బాబు కూడా ఇప్పుడు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. లోకేష్‌తో పాటు బాలకృష్ణ కూడా రాజకీయారంగేట్రం చేయనున్నారు. ఈ విషయాన్ని బాలయ్య ఇప్పటికే ప్రకటించారు.
మాస్‌ను బాలయ్య, యూత్‌ను నారా లోకేష్ ఆకట్టుకుంటారని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని తెలుగుదేశం భావిస్తోంది. నారా లోకేష్ ఎంట్రీపై చర్చ జరుగుతుండగానే ఈ రోజు ఆయన తొలిసారి రాజకీయాలపై స్పందించడం గమనార్హం. సాధారణ కార్యకర్తగానే కొనసాగుతానని లోకేష్ చెప్పినందువల్ల ఆయన రాజకీయ ఆరంగేట్రం ఇక జరిగినట్లే భావించవచ్చు.

0 comments:
Post a Comment