Showing posts with label Eluru. Show all posts
Showing posts with label Eluru. Show all posts

Tuesday, May 22, 2012

Ys Jagan human values : VH


ఏలూరు: పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు చేయించుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మానవతా విలువలు ఎక్కడ ఉన్నాయని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మంగళవారం మాట్లాడారు. అధికారం వస్తే జగన్ ప్రజలను బతకనివ్వరని ఆయన అన్నారు.

వైయస్ జగన్పార్టీకి ఓటువేసే ముందు విజ్ఞులైన ఓటర్లు కాస్తా ఆలోచించాలని ఆయన కోరారు. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీలో ఒక్క వ్యక్తి కూడా శాశ్వతం కాదని, హస్తం గుర్తుతోనే తామంతా గెలిచామని ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దండుకున్న వైయస్ జగన్ పార్టీని ఓడించాలని ఆయన ప్రజలను కోరారు.

సాక్షి మీడియా, వైయస్ జగన్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పోలవరం, నర్సాపురం శాసనసభా నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీదే విజయమని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికల ప్రచారంలో వి. హనుమంతరావు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కోస్తాంధ్రలోని జిల్లాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. వైయస్ జగన్పైనే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలని ఆయన కాంగ్రెసు నాయకులకు సూచిస్తున్నారు కూడా.

Monday, May 7, 2012

Botsa Challenges YS Jagan


అనంతపురం/ఏలూరు: ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెసు పార్టీని మరింత పటిష్టం చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అనంతపురం జిల్లాలో విలేకరులతో అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి రిఫరెండం కాదని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ అన్ని నియోజకవర్గాలలో మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఉప ఎన్నికల అనంతరం పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఒక్క పథకం కూడా ఆగిపోలేదని బొత్స స్పష్టం చేశారు. కిందిస్థాయి కార్యకర్తలను ఉత్తేజపరుస్తామని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పథకం ఆగిపోయిందో జగన్ చెప్పాలని, అలా చెబితే తాను తలదించుకుంటానని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పలు కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల కారణంగా ప్రజలకు సరైన సాయం అందించలేక పోతున్నందుకు ఆవేదనగా ఉందన్నారు.

కరువు సమయంలో ఉప ఎన్నికలు రావడం బాధాకరంగా ఉందన్నారు. మంత్రులు, పార్టీలోని నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అందరూ సఖ్యతతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు.

డబ్బు, మద్యం మాటలకు ప్రస్తుతం ఓటర్లు లొంగడం లేదని కిరణ్ సమావేశంలో అన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడికి అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

Monday, April 30, 2012

Another Tara Chowdary in West Godavari


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో తారా చౌదరి తరహా వ్యవహారం మరొకటి బయటపడింది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలకు అమ్మాయిలను ఎరగా వేసి తర్వాత వారిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం బయటపడిందని ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టీవి ప్రసారం చేసింది. జిల్లాకు చెందిన విజయరత్నం అనే వ్యక్తి నందిని, కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలను రాజకీయ నాయకులు, ప్రముఖులకు ఎరగా వేసి, వారి శృంగార కార్యకలాపాలను చిత్రీకరించారు.

తర్వాత వాటిని చూపించి వారి బ్లాక్ మెయిల్ చేసి వారి నుండి డబ్బులు వసూలు చేసే వారు. ఇలా వసూలు చేసిన డబ్బులు విజయరత్నం వద్ద భారీగా ఉన్నాయని తెలుస్తోంది. విజయరత్నం అకౌంట్లో కోట్లాది రూపాయలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన భార్య, స్నేహితుల అకౌంట్లలోనూ భారీగానే డబ్బులు ఉన్నాయని తెలుస్తోంది.

తన వ్యవహారం బయటపడటంతో విజయరత్నం అండ్ గ్యాంగ్ పరారీ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు కేంద్రంగా వ్యభిచార రాకెట్ను విజయరత్నం నడిపాడు. ప్రభుత్వ అధికారి లేదా రాజకీయ నాయకుడి ఫోన్ నెంబర్ తీసుకొని, అమ్మాయిచే సెక్సీగా మాట్లాడించడం, తర్వాత వారిని తమ ఉచ్చులోకి లాగడం చేసేవారు. ఇలా పలువురు విఐపిలను తమ ముగ్గులోకి వీరు లాగారు.

సుమారు 50 మంది వరకు అధికారులు వీరి ఉచ్చులో చిక్కుకున్నారట. తమ ఉచ్చులో ఇరుక్కున్న వారితో ఎలా వ్యవహరించాలి, వారి వీడియోలను సిసి కెమెరాలలో ఎలా చిత్రీకరించాలనే విషయంపై తన గ్యాంగ్ వారికి విజయరత్నం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేవాడు. మూడేళ్లుగా విజయరత్నం గ్యాంగ్ తరహా కార్యకలాపాలకు పాల్పడుతోంది.

తమ వలలో చిక్కుకున్న వారి శృంగార కార్యకలాపాలను వారు చిత్రీకరించి, తర్వాత సిడిలను చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. కేసులో పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారైన విజయరత్నం వద్ద కీలక ల్యాప్ టాప్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ప్రముఖుల శృంగార సన్నివేశాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget