హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన తాజా మాజీ శాసన
సభ్యుల గన్మెన్ల విషయంలో
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
తాజా మాజీ ఎమ్మెల్యేలకు వెంటనే
గన్మెన్లను పునరుద్ధరించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తాజా
మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్ల ఉపసంహరణపై
ప్రభుత్వానికి శుక్రవారం కోర్టు మొట్టికాయలు వేసింది. వారికి ప్రభుత్వం సొంత ఖర్చులతో సెక్యూరిటీని
ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వారికి రక్షణ కల్పించాలని సూచించింది.
అయితే హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వం వారికి తిరిగి గన్మెన్లను ఇచ్చే
అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా
జగన్ పార్టీకి చెందిన అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులకు ఇటీవల కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వం గన్మెన్లను ఉపసంహరించుకున్న
విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వారు
హైకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రభుత్వం గన్మెన్లను ఉపసంహరించిందని,
తిరిగి కేటాయించాలని వారు కోర్టును కోరారు.
వారి
పిటిషన్ స్వీకరించిన కోర్టు దీనిపై విచారణ జరిపి రక్షణ ఇవ్వాలని
ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా గన్ మెన్ల
ఉపసంహరణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అప్పుడే ప్రభుత్వంపై
విరుచుకు పడ్డారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లి
న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment