హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్, సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ తదితర
కీలకమైన కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ అదనపు సంచాలకులు
లక్ష్మీ నారాయణకు ఢిల్లీ సిబిఐ కార్యాలయం నుండి
శుక్రవారం అత్యవసర పిలుపు వచ్చింది.
శనివారం
ఉదయం ఢిల్లీకి రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆయన ఈ
రోజు సాయంత్రం ఏడు గంటల ఫ్లైట్కు ఢిల్లీ బయలుదేరి
వెళ్లనున్నారు. లక్ష్మీ నారాయణ సిబిఐ డైరెక్టర్తో
రేపు ఉదయం పది గంటలకు
భేటీ కానున్నారు. తాను దర్యాఫ్తు చేస్తున్న
పలు కీలక కేసుల పురోగతిని
ఆయనకు వివరించనున్నారు. ఈ కేసులపై పలు
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
శనివారం
సాయంత్రం లక్ష్మీ నారాయణ ఢిల్లీ నుండి మెక్సికోకు వెళ్లనున్నారు.
అక్కడ ఆయన దర్యాఫ్తు సంస్థల
అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. మూడు రోజుల అక్కడే
ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్
తిరిగి వస్తారు. లక్ష్మీ నారాయణ ప్రొఫెషనల్ పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆయనకు పాసుపోర్టు జారీ అయింది.
కాగా
లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసులో
పది రోజుల క్రితం సిబిఐ
ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం
తెలిసిందే. ఆ తర్వాత విడతల
వారిగా ఛార్జీషీట్ దాఖలు చేస్తామని సిబిఐ
జెడి లక్ష్మీ నారాయణ చెప్పారు. ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్ కేసులోనూ ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేశారు.
0 comments:
Post a Comment