ఆరోపణలు,
విచారణలు చుట్టుముడుతున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ
ధైర్యంతో ముందుకు సాగుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. తన ఆస్తులపై సిబిఐ
విచారణ చేపట్టినా, పరిటాల రవి హత్య కేసు
నుంచి సూరి హత్య కేసు
దాకా తనపై ఆరోపణలు వస్తున్నా
వైయస్ జగన్ వెనక్కి తగ్గడం
లేదు. పైగా, ముందుకు సాగుతున్నారు.
ఆయన ఈ తెగింపునకు కారమణమేమిటనేది
ప్రశ్న. వైయస్ జగన్ది
మొండి పట్టుదల అంటారు.
వైయస్
జగన్ను అరెస్టు చేయడానికి
సిబిఐ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ వెనక్కి తగ్గుతుందనే మాట వినిపిస్తోంది. సిబిఐ
రెండు మూడు సార్లు ఆయనను
అరెస్టు చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఏ
క్షణంలోనైనా ఆయనను సిబిఐ అరెస్టు
చేయవచ్చుననే మాట ఇప్పటికీ వినిపిస్తూనే
ఉన్నది. సిబిఐ అరెస్టు నుంచి
తప్పించుకోవడానికే ఆయన నిరంతరం ప్రజల్లో
తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన చుట్టూ తన
అనుచరులతో ఓ వలయాన్ని కూడా
ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
వైయస్
జగన్ అరెస్టు అవుతారని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ రాజకీయాల్లో ముందడుగు వేయడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్
వెంట వెళ్లే నాయకుల సంఖ్య కూడా పెరుగుతూ
వస్తోంది. వారంతా ఏ దైర్యంతో ఆయన
వెంట నడుస్తున్నారనే ఆశ్చర్యం కూడా వేస్తోంది. జగన్
అరెస్టు అయితే పార్టీ పరిస్థితి
ఏమిటి, తమ పరిస్థితి ఏమిటనే
ఆలోచన వారికి రావడం లేదా, మరి
ఎందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లనేది వింతగానే ఉంది.
ముఖ్యమంత్రి
పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు
చేసి, విఫలమైన, కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించి సొంత పార్టీని ఏర్పాటు
చేసుకున్న తర్వాత ఆయనకు వెనక్కి తగ్గే
అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెసు అధిష్టానంతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించారనే ప్రచారం జరుగుతూనే ఉంది. కాంగ్రెసుతో ఒప్పందం
చేసుకోవడం వల్లనే జగన్ అరెస్టు జరగడం
లేదని నారా చంద్రబాబు నాయుడి
నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రతి రోజూ అంటూనే
ఉన్నారు.
అన్ని
పార్టీలు ఏకబిగిన విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నా, కేసుల విచారణ కొనసాగుతున్నా
పట్టు విడవని విక్రమార్కుడిలా జగన్ ముందుకే సాగుతున్నారు.
తాను అనుకున్నది సాధించడానికి ఆయన ఎంతటి శ్రమనైనా
ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్ కనిపిస్తున్నారు. తెలుగుదేశం,
కాంగ్రెసు పార్టీలకు ఆయన రాజకీయంగా ఎలా
ఎదుర్కోవాలో కూడా అంతు పట్టని
పరిస్థితి ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. మొత్తం
మీద, వైయస్ జగన్ రాజకీయం,
వ్యక్తిగత జీవితం ఎప్పుడు ఏ మలుపైనా తీసుకోవచ్చుననే
అభిప్రాయం మాత్రం బలంగా ఉంది.
0 comments:
Post a Comment