హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
కుటుంబ సమస్యల్లో ఉన్నారని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర
వెంకట రమణ రెడ్డి విమర్శించారు.
ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలను దృష్టిలో
పెట్టుకొని గండ్ర టిడిపి అధినేత
ఫ్యామిలీ సమస్యల్లో చిక్కుకున్నారని సోమవారం ఎద్దేవా చేశారు. ఆయన అధికారానికి దూరమై
తొమ్మిదేళ్లు కావొస్తుందని, దానిని అతను తట్టుకోలేక పోతున్నారని,
అందుకే ఇష్టం వచ్చిన రీతిలో
మాట్లాడుతున్నారని విమర్శించారు.
బడ్జెట్
సమావేశాలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు దూరంగా ఉండనున్నారని చెప్పారు. పార్లమెంటులో టి-ఎంపీల తీరు
తప్పు కాదన్నారు. పరిస్థితిలకు అనుగుణంగా వారు అలా వ్యవహరించారన్నారు.
ఏదైనా ఒక సమస్యను ఒక్కొక్కరు
ఒక్కోలా చూస్తారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ త్వరలో పరిష్కారమవుతుందని చెప్పారు.
ఇప్పుడు
చిరంజీవిని విమర్శిస్తున్న నేతలు మూడేళ్ల కిందట
ఏం మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని
గండ్ర వెంకట రమణ రెడ్డి
సూచించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించడం సరికాదని
మంత్రి శైలజానాథ్ అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో పదవులు
పొంది, ఇప్పుడు ఎవరికోసమో విమర్శించడం సబబేనా అని ప్రశ్నించారు.
కాగా
గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఆ ప్రాంతాల్లోనే ఉపాధి
పనులు ఎక్కువగా చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు అధికారులకు సూచించారు. సోమవారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉపాధి
హామీ పథకం స్టేట్ కౌన్సిల్
సమావేశానికి హాజరైన ఆయన అధికారులకు పలు
సూచనలు చేశారు. కౌన్సిల్ సమావేశం ప్రతి రెండు నెలలకు
జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు.
కౌన్సిల్
సభ్యులు కూడా మండలాల్లో తిరిగి
ఉపాధి పనులు పర్యవేక్షించాలని మంత్రి
డొక్కా మాణిక్యవరప్రసాద్రావు పేర్కొన్నారు. సమావేశంలో
మంత్రి జానారెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం, కమిషనర్ జయలక్ష్మి, సీవీవో కృష్టయ్య, డైరక్టర్ మురళి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment