కాంగ్రెసు
పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మేనేజ్మెంట్కు తెలంగాణ
రాష్టర్ సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
ఫిక్సయ్యారా? తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఇదే ప్రశ్న వేస్తున్నారు.
తమ పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్ వక్ఫ్ భూములను ఆక్రమించారని
ఆయన శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ఆ భూములను స్వాధీనం
చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని 1,600 ఎకరాల భూముల వ్యవహారాన్ని
వక్ఫ్బోర్డు ట్రిబ్యునల్లోనే తేల్చుకోవాలని హైకోర్టు
ఆదేశించిన తర్వాత కూడా తెలుగుదేశం, తెరాస,
మజ్లిస్, బిజెపిల్లోని ముస్లిం నేతలు ఎందుకు స్పందించడం
లేదని ఆయన అడిగారు. లగడపాటి
రాజగోపాల్ మేనేజ్మెంట్కు ఏమైనా
వారు ఫిక్సయ్యారా అని ఆయన ప్రశ్నించారు.
ముస్లింల
ప్రయోజనాలను దెబ్బతీసేలా జరిగిన వ్యవహారంలో లగడపాటి రాజగోపాల్ ప్రమేయం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ముస్లింలకు మేలు జరిగేలా చూడాలని
ఆయన అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం
చర్యలు చేపడుతున్నా లగడపాటి వక్ఫ్ స్థలాలను ఆక్రమించుకోవడం
వల్ల పార్టీ కూడా అప్రతిష్ట పాలయ్యే
ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
అన్ని
పార్టీలకు చెందిన ముస్లిం నేతలు కూడా హైకోర్టు
తీర్పు వచ్చి మూడు రోజులైనా
ఎందుకు స్పందించడం లేదని ప్రభాకర్ ప్రశ్నించారు.
వక్ఫ్ భూముల కబ్జాపై తమ
పార్టీ పార్లమెంటు సభ్యుడు వి.హన్మంతరావు పలుమార్లు
మీడియాలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.
0 comments:
Post a Comment