న్యూఢిల్లీ:
రాష్ట్రపతి ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని 18 శానససభా
స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ఎన్నికలకు ముందే దేశంలో ఖాళీగా
ఉన్న అన్ని స్థానాల్లో ఎన్నికలు
నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని
కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ చెప్పారు. దేశంలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాలకు
త్వరలో ఉప ఎన్నికలు జరుగుతాయని
ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు,
ఉప ఎన్నికలకు సంబంధం లేదని ఆయన అన్నారు.
దేశంలో ఖాళీ అయిన స్థానాలకు
సంబంధించిన సమాచారం తమకు అందాల్సి ఉందని
ఆయన చెప్పారు. సమాచారం రాగానే ఉప ఎన్నికలపై తగిన
ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. ఈ
నెలాఖరునాటికి ఉప ఎన్నికలనాటికి ఓ
ప్రకటన చేసే అవకాశం ఉందని
ఆయన చెప్పారు. తాము ఉప ఎన్నికలకే
ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రపతి
ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే
అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనివల్ల వైయస్ రాజశేఖర రెడ్డి
పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి కరిగిపోతుందని
కాంగ్రెసు వర్గాలు భావించినట్లు చెబుతారు. దీనివల్ల వైయస్ జగన్ నాయకత్వంలోని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను ఓడించడం సులభమవుతుందని కాంగ్రెసు నాయకులు భావిస్తూ వస్తున్నారు. అయితే, సాధ్యమైనంత త్వరగా ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి
వైయస్ జగన్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
శనివారం
బ్రహ్మ చేసిన ప్రకటనతో వైయస్
జగన్ వర్గంలో ఉత్సాహం చోటు చేసుకుంది. వైయస్
రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు నాయకులు పలు కోణాల నుంచి
విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు త్వరగా
రావాలని వారు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు విమర్శల వల్ల ప్రజల్లో వ్యతిరేక
భావన ఏర్పడక ముందు, వైయస్ రాజశేఖర రెడ్డిపై
సానుభూతి సన్నగిల్లక ముందు ఉప ఎన్నికలను
ఎదుర్కోవాలనే జగన్ అనుకుంటున్నారు. ఎన్నికల
కమిషన్ తాజా ప్రకటన వైయస్
జగన్కు ఉత్సాహం కలిగించేదే.
0 comments:
Post a Comment