చిత్తూరు:
వ్యభిచార కుంభకోణంలో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి
గురించి మాట్లాడేంత నీచ స్థాయికి తాను
దిగజారలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
నారాయణ సోమవారం విలేకరులతో అన్నారు. ఆయన చిత్తూరు జిల్లాలో
మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
తాను
ముఖ్యమంత్రి అయిన ముహూర్తం బాగా
లేదని కిరణ్ కుమార్ రెడ్డి
వ్యాఖ్యానించడం సిగ్గు చేటు అన్నారు. ముహూర్తం
బాగా లేనిది కిరణ్ రెడ్డికి కాదని
కాంగ్రెసు పార్టీకి అని చెప్పారు. పార్టీ
క్షీణ దశకు చేరుకుందని ఆయన
విమర్సించారు. కాంగ్రెసు పార్టీ తప్పుడు విధానాల వల్లనే పదే పదే రాష్ట్రంలో
ఉప ఎన్నికలు వస్తున్నాయని మండిపడ్డారు.
రానున్న
పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో
జరిగే ఉప ఎన్నికలలో సిపిఐ
పోటీ చేస్తుందా లేదా అనే విషయమై
ఈ నెల 19న పార్టీలో
చర్చించి ఆ తర్వాత ప్రకటన
చేస్తామని చెప్పారు. కిరణ్ పాలన తీరు
వల్ల కాంగ్రెసు అధోగతికి చేరుకుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం రిటైల్ అవినీతిని బయటపెట్టి హోల్ సేల్ అవినీతిని
మాత్రం దాచి పెడుతోందని విమర్శించారు.
ప్రస్తుతం
కాంగ్రెసు ప్రభుత్వం ప్రమాదపుటంచున ఉందని చెప్పారు. అరెస్టైన
వర్ధమాన నటి తారా చౌదరి
గురించి మాట్లాడే స్థాయికి తాను దిగజారలేదని చెప్పారు.
కాంగ్రెసు పార్టీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం
విమర్శించారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం
ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు.
0 comments:
Post a Comment