హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్
సోనియా గాంధీ ఆదేశాలు పాటించిన
మేనేజర్ మాత్రమేనని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ సోమవారం
అన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో వైయస్
రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరం
లేదని యాష్కీ చెప్పారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్
జగన్మోహన్ రెడ్డి 2014లో జరిగే సాధారణ
ఎన్నికలలో 294 సీట్లలో గెలిస్తే రాష్ట్రం భ్రష్టు పట్టి పోతుందని విమర్శించారు.
ఉప ఎన్నికలలో సీమాంధ్ర నేతలు పార్టీ అభ్యర్థులను
గెలిపించి కాంగ్రెసు సత్తా చాటాలని సూచించారు.
తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని పార్టీ అధిష్టానంతో చెప్పిస్తే పరకాలలో గెలిపించే బాధ్యత మాదేనని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఓ స్పష్టమైన ప్రకటన
చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పారు.
తెలంగాణ,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితర సమస్యలు తట్టుకోలేకే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఒత్తిడిలో ఏవేవో మాట్లాడుతున్నారని కరీంనగర్
పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలని తాము అధిష్టానానికి ఎప్పుడూ
ఫిర్యాదులు చేయలేదన్నారు. మాకు ముఖ్యమంత్రి మార్పు
ముఖ్యం కాదన్నారు. తెలంగాణపై ఆయన వైఖరి మారటం
కావాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కిరణ్
గుర్తించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన కేంద్రంపై ఒత్తిడి
తీసుకు రావాలని సూచించారు.
కాగా
అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
కాంగ్రెసు సీనియర్ కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి జీవన్
రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీలోనే అసలు
రెడ్లున్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెడ్డి
అవునా, కాదా అనే చర్చ
అనవసరమని ఆయన సోమవారం మీడియా
ప్రతినిధులతో అన్నారు. కిరణ్ కుమార్ కనీసం
రెడ్లను కూడా ఆకర్షించలేకపోతున్నారని ఆయన తప్పు
పట్టారు.
రెడ్డి
అయి ఉండి కూడా తన
వెంట రెడ్లు రావడం లేదని కిరణ్
కుమార్ రెడ్డి అంటున్నారంటే ఏ విధమైన అభిప్రాయం
కలుగుతుందని ఆయన అన్నారు. రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉండి రెడ్లు కాంగ్రెసు
వెంట రావడం లేదంటే ఎలా
అని ఆయన అడిగారు. కిరణ్
కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పార్టీలో
చీలిక ప్రారంబమైందని ఆయన అన్నారు. కిరణ్
కుమార్ రెడ్డి మాటలు కాంగ్రెసు శ్రేణులను
నిరాశకు గురి చేస్తున్నాయని ఆయన
అన్నారు.
తాను
ముఖ్యమంత్రి అయిన ముహూర్తం బాగా
లేదని, మూడు నెలలకు ఒకసారి
ఎన్నికలు వస్తుండడం వల్ల ఏమీ చేయలేకపోతున్నానని
ముఖ్యమంత్రి అంటున్నారని, ఈ విధమైన మాటల
వల్ల కాంగ్రెసు శ్రేణులకు ఏ విధమైన అభిప్రాయం
ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై
కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు
వ్యతిరేకంగా సీమాంధ్రలో చర్చ జరగడం వెనక
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఉన్నారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment