రామ్
చరణ్ తాజాగా నిన్న జరిగిన గబ్బర్
సింగ్ ఆడియో ఫంక్షన్ కి
హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే. అయితే
జంజీర్ షూటింగ్ లో బిజీగా ఉండటం
వలన ఆయన రాలేకపోయారని ఆయన
తండ్రి చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయమై
పిల్మ్ సర్కిల్స్ లో, సినిమా వాళ్లలో
రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీంతో రామ్ చరణ్
ట్విట్టర్ లో ఓ పోస్ట్
పెట్టారు.
ఆ ట్వీట్ లో...జస్ట్ ఇప్పుడే
అమితాబ్ సార్ ని కలిసాను...ఆయన ఆశీస్సులు తీసుకున్నాను...ఇప్పుడే జంజీర్ మొదలైంది. ..అలాగే ఆల్ ది
బెస్ట్ కళ్యాణ్ బాబాయ్.... మరియ్... గబ్బర్ సింగ్ టీమ్..నేను
గబ్బర్ సింగ్ లో ఐటం
సాంగ్ విన్నాను..ఇది రాకింగ్...దేవిశ్రీప్రసాద్
కి స్పెషల్ ధాంక్స్...అంతటి మంచి మ్యూజిక్
ఇచ్చినందుకు...ధాంక్యూ అన్నారు. అలాగే తను అమితాబ్
తో కలిసి దిగిన ఫోటో
ను కూడా ఆయన అక్కడ
పోస్ట్ చేసారు.
ఇక ఈ విషయం మళ్లీ
గతంలో పవన్ తరహాలో మీడియాలో
అల్లరి అవుతుందని ముందుగానే చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారు. తమ ప్రసంగంలో ఈ
విషయం ప్రస్తావిస్తూ మీడియాకు చురకలేసారు. అలాగే లేనిపోని వార్తలు
సృష్టించి మా మెగా కుటుంబాన్ని
దిగజార్చవద్దని సభాముఖంగా విన్నవించుకుంటున్నాను అని అన్నారు. దాంతో
నిజానకి ఈ వార్తకి పెద్ద
ప్రయారిటీ లేకపోయినా మీడియా దృష్టి మొత్తం రామ్ చరణ్ ఎందుకు
రాలేదు అన్న మ్యాటర్ పై
కేంద్రీకృతమైంది.
చిరంజీవి
మాటల్లోనే...'జంజీర్' షూటింగ్ కోసం చరణ్ ముంబైలో
ఉన్నాడు. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదు.
'చరణ్ ఉళ్లో ఉన్నాడు.. రాలేదు..'
అని మీడియావాళ్లు ప్రచారం చేస్తారేమో? నిజంగా తను లేడు. 'రచ్చ'
పాటల వేడుకకు పవన్ రాలేదు. రెండు
రోజుల తరవాత ఓ కార్యక్రమంలో
పవన్ కనిపిస్తే... కావాలనే రాలేదని వక్రీకరించారు. అబద్ధాలు చెప్పే స్థాయికి మెగా కుటుంబం దిగజారలేదు''
అన్నారు.
పనిలో
పనిగా పవన్ కళ్యాణ్ గతంలో
రచ్చ ఆడియోకి రాని విషయాన్ని కూడా
ప్రస్తావించారు. ఆ మాటల్లో..‘‘రచ్చ
ఆడియో వేడుక జరిగినప్పుడు ‘పవన్‌కళ్యాణ్ విదేశాల్లో ఉన్నాడు. చరణ్‌కి బెస్ట్
విషెస్ చెప్పమన్నాడు’
అని చెప్పాను. కానీ, ఆ తర్వాత
రెండు, మూడు రోజులకు పూరి
జగన్నాథ్‌కి సంబంధించిన ఫంక్షన్లో పవన్ కనిపిస్తే..
హైదరాబాద్‌లోనే ఉండి ‘రచ్చ’ ఆడియో
ఫంక్షన్‌కి రాలేదని వార్త
సృష్టించారు. మాట తప్పడం మెగా
కుటుంబం చరిత్రలో లేదు. పవన్‌కళ్యాణ్
ప్రయాణం చేసిన ఫ్లయిట్ టిక్కెట్,
కస్టమ్స్ డాక్యుమెంట్స్ అన్నీ ‘రచ్చ’ ఆడియో వేడుక తర్వాతి
తేదీల్లో ఉన్నవే. ఇప్పుడు రామ్‌చరణ్ ‘జంజీర్’ చిత్రం
షూటింగ్ కోసం ముంబయ్‌లో
ఉన్నాడు. బాబాయ్‌కి నా విషెస్
చెప్పండని నాతో అన్నాడు. దయచేసి
ఈ మాటలను కూడా వక్రీకరించమాకండి అని
ఉద్వేగంగా ప్రసంగించారు.
0 comments:
Post a Comment