హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఏడు సూత్రాల
పథకం అమలు కమిటీ చైర్మన్
తులసి రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం మీడియాతో
మాట్లాడారు. 2014 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్ని స్థానాలు గెలుచుకుటుందని
బీరాలు పలుకుతున్నారని విమర్శించారు.
కానీ
ఆయనవి అన్ని పగటి కలలే
అని విమర్శించారు. 2014లోపే జగన్ స్థాపించిన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమన్నారు.
పదే పదే వచ్చే ఉప
ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తాయని ఆయన చెప్పారు. మూడు
నెలలకోసారి ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక పదే
పదే ఎన్నికల కారణంగా కోడ్ వస్తే అభివృద్దికి
విఘాతం కలుగుతుందనే ఆయన అలా మాట్లాడారని
అన్నారు.
కాగా
ఆదివారం మంత్రి ధర్మాన ప్రసాద రావు జగన్ పై
తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునుగుతారని ధర్మాన ఆదివారం అన్నారు. జగన్వి వ్యాపార
రాజకీయాలని విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలేకరులతో ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశపెట్టిన పథకాలు ప్రస్తుతం అమలుకానట్లు చెబుతున్న జగన్ కళ్లు తెరిచి
చూడాలని సూచించారు.
ప్రజలకు
కల్లబొల్లి మాటలు చెప్పి నంగనాచిలా
మాట్లాడుతున్న జగన్ను నమ్ముకుంటే
నట్టేట ముంచుతాడన్నారు. అలా జగన్ను
నమ్మివెళ్లిన వ్యక్తులు తమ తప్పును గుర్తించే
రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. నరసన్నపేట ఉప ఎన్నికల్లో జగన్
వచ్చి కుర్చున్నా ప్రజలంతా కాంగ్రెస్కే పట్టం కడతారని
ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడైన జగన్ను ఏ
ఒక్కరైనా నిజాయితీపరుడు అని చెప్పగలరా అని
ప్రశ్నించారు.
0 comments:
Post a Comment