హైదరాబాద్:
మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి నిరుడు జనవరి
3వ తేదీన హత్యకు గురయ్యాడు.
అతని ప్రధాన అనుచరుడైన భాను కిరణ్ అప్పటి
నుంచి పరారీలో ఉన్నాడు. హైదరాబాదులోని యూసుఫ్గుడాలో సూరి పట్టపగలు హత్యకు
గురయ్యాడు. సూరిని కారులోనే వెనక నుంచి హత్య
చేశాడని కారును నడుపుతున్న మధుమోహన్ చెప్పాడు. ముందు సీట్లో తన
పక్కన్న కూర్చున్న సూరిని వెనక సీట్లో కూర్చున్న
భాను కిరణ్ కాల్చి చంపాడని
మధు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.
భాను
కిరణ్ సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు. యూసుఫ్గుడాలోని నవోదయ కాలనీ నుంచి
మధు కారులోనే అపోలో ఆస్పత్రికి తరలించాడు.
హత్య చేసి తాను తేరుకునేలోగానే
సర్రున తలుపు తీసుకుని భాను
పారిపోయాడని మధు చెప్పాడు. అయితే,
నవోదయ కాలనీ నుంచి సూరిని
ఆస్పత్రికి తరలించడానికి మధు గంటన్నర సమయం
తీసుకున్నాడు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సూరి
హత్య కేసు హైదరాబాద్ నగర
నేరపరిశోధక విభాగం (సిసిఎస్) నుంచి సిఐడికి బదిలీ
అయింది. సూరి హత్య కేసులో
నలుగురిని అరెస్టు చేశారు. మన్మోహన్ సింగ్, సుబ్బయ్య, హరిబాబు, వెంకటరమణ అనే వ్యక్తులను అరెస్టు
చేశారు. 2009 ఏప్రిల్ 29వ తేదీన పోలీసులు
సూరి హత్య కేసులో ఓ
చార్జిషీట్ దాఖలు చేశారు. భాను
కిరణ్ అరెస్టయిన తర్వాత పూర్తి స్థాయి చార్జిషీట్ దాఖలు చేస్తామని సిఐడి
అధికారులు కోర్టుకు చెప్పారు.
భాను
కిరణ్ను పట్టుకోవడానికి సిఐడి
నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా గాలింపు జరిపింది. ఢిల్లీలోని ఓ లాడ్జిలో ఓసారి
భాను కిరణ్ 15 రోజుల పాటు తలదాచుకున్నాడు.
ఢిల్లీలో భాను కిరణ్కు
సన్నిహితుడైన ఓ వ్యక్తిని కూడా
పోలీసులు గతంలో పట్టుకున్నారు. పోలీసులను
భాను కిరణ్ ముప్పు తిప్పలు
పెట్టాడు. హర్యానా, గుజరాత్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో గాలించారు.
కర్ణాటకలోని
ఓ ప్రజాప్రతినిధితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. బెంగళూర్లో జరిగిన ఐపియల్
మ్యాచును వీక్షించినట్లు చెబుతున్నారు. అతని ఫోటోను ఆ
సమయంలో ఓ వ్యక్తి తీసినట్లు
కూడా చెబుతున్నారు. మారువేషాలు వేస్తూ పోలీసుల నుంచి భాను కిరణ్ను తప్పించుకుంటూ వస్తున్నట్లు
చెబుతున్నారు. డబ్బుల కోసం మిత్రుడు మధుకు
లేఖలు రాస్తూ వచ్చాడని చెబుతారు. ఆ లేఖల ఆధారంగానే
భాను కిరణ్ను పోలీసులు
పట్టుకున్నట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment