అనంతపురం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి 'రెడ్డి' కాదన్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి, అనంతపురం
జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి
ఆదివారం వివరణ ఇచ్చారు. తాడిపత్రిలో
ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు రఘువీరా రెడ్డి, గీతా రెడ్డి రెడ్లు
కాదని, అలాగే వైయస్ జగన్మోహన
రెడ్డి కూడా రెడ్డి కాదని
నా అభిప్రాయం చెప్పానని ఆయన అన్నారు.
వైయస్
జగన్ 'రెడ్డి' కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలు
కులచిచ్చు రేపుతున్నాయన్న ఆరోపణలపై జెసి అలా స్పందించారు.
జగన్ను 'రెడ్డి' సామాజిక
వర్గం నుంచి దూరం చేసేందుకు
మీరు అలా మాట్లాడారా అని
విలేకరులు అడిగితే.. అలా కాదని, జగన్
నిజమైన రెడ్డి కాదు కాబట్టి ఉన్న
విషయం చెప్పానని జెసి అన్నారు. అందరూ
వాస్తవాన్ని తెలుసుకోవాలనే తాను చెప్పానని అన్నారు.
ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్
అభ్యర్థికి తన అవసరం ఉందని
గుర్తించి ప్రచారానికి రమ్మంటే వెళతానని చెప్పారు. తన అవసరం కంటే
జిల్లాలో ఉన్న మంత్రుల అవసరమే
అభ్యర్థులకు ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు ఉప్పగా
ఉంటాయని, అభ్యర్థి శక్తి సామర్థ్యాలు బట్టి
గెలుపోటములు ఉంటాయని బదులిచ్చారు.
ఎన్నికలకు
దూరంగా ఉండాలని రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తన మేనల్లుడు
దీపక్ రెడ్డికి తాను పదే పదే
చెప్పి చూశానన్నారు. కానీ దీపక్ రెడ్డి
తన మాట వినలేదని జెసి
దివాకర్ రెడ్డి చెప్పారు. కాగా ఇటీవల జెసి..
జగన్మోహన్ రెడ్డి 'రెడ్డి' కాదని, ఈ విషయాన్ని బాగా
ప్రచారం చేయాలని పలువురు నేతల సమక్షంలో అన్న
విషయం తెలిసిందే.
జగన్
వెంట చాలామంది రెడ్లు వెళుతున్నారని, వారిని కట్టడి చేయాలంటే ఆయన రెడ్డి కాదన్న
విషయం చెప్పాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మరో
నేత తులసి రెడ్డి మాట్లాడుతూ..
జగన్ ఇంట్లో అన్ని క్రైస్తవ ఆచారాలే
ఉంటాయని చెప్పారు. జగన్ రెడ్డి కాదనే
చర్చ తీవ్ర దుమారం రేపింది.
0 comments:
Post a Comment