హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు వేర్వేరుగా మండిపడ్డారు. ఇటీవల ఏర్పడిన కొత్త
పార్టీ నేత తిరుగుతూ సిద్ధాంతాలు
లేని ప్రకటనలు చేస్తు పబ్బం గడుపుకుంటున్నారని మంత్రి
డొక్కా మాణిక్య వర ప్రసాద్ తూర్పు
గోదావరి జిల్లాలో జగన్ను ఉద్దేశించి
అన్నారు. శవ రాజకీయాలు చేస్తూ
అతను ఏడవడమే కాకుండా మిగతా వారిని ఏడిపిస్తున్నారని
అన్నారు.
ఎటువంటి
ఎజెండా లేని ప్రాంతీయ పార్టీలు
త్వరలో కనుమరుగవుతాయని చెప్పారు. కాంగ్రెసు పాడి గేదె అయితే
మిగతా పార్టీలు దున్నపోతు వంటివి అని చెప్పారు. వైయస్
రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు జగన్కు అనుకూలంగా సంతకం
చేసినందుకు ఇప్పుడు తాను చింతిస్తున్నానని మరో
మంత్రి తోట నరసింహం అన్నారు.
తండ్రి మృతదేహం ఇంటికి చేరకుండానే ఆయన సిఎం పదవి
కోసం తహతహలాడారని ఆరోపించారు.
ఆయన తూర్పుగోదావరి రామచంద్రాపురంలో ప్రచారం నిర్వహించారు. జగన్ తీరు చాలా
ప్రమాదకరంగా ఉందన్నారు. త్వరలోనే ఆయన భవితవ్యం ఏమిటో
తేలుతుందని చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి
అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి
వైయస్ కంటే ఎక్కువ ఏమీ
చేయలేరని మరో మంత్రి టిజి
వెంకటేష్ అన్నారు.
జగన్కు ముఖ్యమంత్రి పీఠంపై
అధికార కాంక్ష తప్ప మరొకటి లేదన్నారు.
జగన్కు చెందిన సాక్షి
పత్రికలో ప్రతి వ్యాఖ్య తిరగరాయడం
తప్ప ఏదీ కనిపించదన్నారు. తిరగరాయడం
మినహా ఆ మీడియాకు మరో
పనే లేదని ఎద్దేవా చేశారు.
జరిగిన తప్పులు బేరీజు వేసుకుని పాప ప్రక్షాళన చేసుకుంటే
తప్ప కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని రాజ్యసభ
సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
అవినీతితో
లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి మీద, ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీద
దుమ్మెత్తి పోస్తున్నాడని, తానొస్తే రెండేళ్లలో పోలవరం కట్టేస్తా అంటున్నాడని విమర్శించారు. జగన్ తప్పు చేసి
కూడా తాను నీతిపరుడన్నట్లు ప్రచారం
చేసుకుంటున్నాడని అన్నారు. జగన్ ఎవరి సహకారంతో
డబ్బు సంపాదించాడో చెప్పకపోతే అది కాంగ్రెస్ పార్టీకి
హానీ చేస్తుందని, అందుకే గతంలో చేసిన తప్పును
గుర్తించి, దాన్ని ఒప్పుకోవడం మంచిదేనన్నారు.
0 comments:
Post a Comment