టాటా
మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్
ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ "రేంజ్
రోవర్ ఎవోక్"కు మార్కెట్లో అశేష
ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ అన్ని
మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.
అంతేకాకుండా.. ఇది తాజాగా ఈ
ఏటి మేటి ప్రపంచపు మహిళా
కారుగా కూడా ఓ ప్రత్యేక
స్థానాన్ని దక్కించుకుంది.
మంచి
స్టయిల్తో కూడిన రేంజ్
రోవర్ ఎవోక్ క్రాసోవర్ 2012 సంవత్సరానికి
గానూ ఉమెన్స్ కార్ ఆఫ్ ది
ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్
నెలలో జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో ఈ అవార్డుల
కార్యక్రమం జరగనుంది. ఈ అవార్డుల జాబితాలో
రేంజ్ రోవర్ ఎవోక్ అగ్రస్థానాన్ని
దక్కించుకోగా, బిఎమ్డబ్ల్యూ 3-సిరీస్
సెడాన్ ద్వితీయ స్థానాన్ని, ఆడి క్యూ3 కాంపాక్ట్
క్రాసోవర్ మూడవ స్థానాన్ని ఆక్రమించాయి.
ఈ ఉమెన్స్ కార్ ఆఫ్ ది
ఇయర్ అవార్డుల కోసం 32 కార్లు ఎంపిక అయ్యాయి. మొత్తం
11 దేశాలకు చెందిన 20 మహిళా న్యాయనిర్ణేతలతో కూడిన
జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది.
ఇక రేంజ్ రోవర్ ఎవోక్
క్రాసోవర్ విషయానికి వస్తే, ఇది పరిమాణంలో చిన్నదిగా
ఉండి, తక్కువ బరువును కలిగి ఉండి అధిక
మైలేజ్ను ఆఫర్ చేసే
ప్రీమియం కారు. గడచిన సంవత్సరంలో
టాటా మోటార్స్ ఈ రేంజ్ రోవర్
ఎవోక్ కారును భారత మార్కెట్కు
తీసుకువచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ
కారు ప్రారంభ ధర రూ.44.75 లక్షలు
(ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.
ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్
ధర రూ.56.7 లక్షలుగా ఉంది.
0 comments:
Post a Comment