ప్రముఖ
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఈగ'. నాని, సమంత,
సుదీప్ కీలక పాత్రధారులు. సోషియో
ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తి
స్ధాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కుతోంది. పిల్లలలను,పెద్దలను అలరించటానికి రెడి అయిన ఈ
చి్తరం వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కించారు. ఈ చిత్రంవిడుదల తేదీ
పై రాజమౌళిఅఫీషియల్ గా ప్రకటన చేసారు.
రాజమౌళి
మాట్లాడుతూ "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా
ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ
తిరిగే కథే 'ఈగ'. సినిమా
మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే
అతను ఈగ రూపంలో విలన్పై ఎలా పగ
సాధించాడు అనేది సస్పెన్స్. సంక్షిప్తమైన
ఈ కథను నాని, సమంత,
సుదీప్ అర్థం చేసుకుని చక్కగా
నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ
చిత్రంలో ఉంటాయి. మే 30న సినిమాను
ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
ఈ చిత్రం ప్రమోషన్ ని పెంచారు రాజమౌళి.
ఫేస్ బుక్,ట్విట్టర్,మీడియా,టీవీ ఛానెల్స్ అనే
తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ
లెవల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆయన తాజాగా ఈ
చిత్రం కధ గురించి చెబుతూ
తమ చిత్రం నాని, బిందుల మధ్య
లవ్ స్టోరీ అన్నారు. నాని పాత్రలో నాని,బిందు పాత్రలో సమంత
నటిస్తోంది అన్నారు. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేసించి ఏమి
చేసిందనేదే కథ అంటున్నారు.
గ్రాఫిక్స్
ప్రధానాంశంగా రూపొందుతున్న 'ఈగ'చిత్రంలో నాని,
సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ
''కెమెరా కంటికే స్పష్టంగా చిక్కనంత చిన్న ప్రాణి 'ఈగ'.
ఓ బలవంతుడైన మనిషితో వైరం పెంచుకొంది. అతన్ని
ఓడించడానికి ఎలాంటి ఎత్తులు వేసింది? ఎన్ని సాహసాలు చేసింది?
అనేదే కథలో కీలకం. ప్రతినాయకుడిపై
ఈగ ఎలా విజయం సాధించిందీ
అన్నది ఆసక్తికరం. ఆ సన్నివేశాల్ని విజువల్
ఎఫెక్ట్స్‌లో తీర్చిదిద్దుతున్నాం అన్నారు.
ఈ చిత్రంపై రాజమౌళి చాలా కాన్ఫిడెండ్ గా
ఉన్నారు. అలాగే ఈగ బడ్జెట్
ముప్పై కోట్లు దాటిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చాలా
చిన్న బడ్జెట్ అనుకుని నాని వంటి చిన్న
హీరోతో ప్రారంభించిన ఈ చిత్రం అనుకోని
విధంగా గ్రాఫిక్స్ హంగామాతో ఈ రేంజి బడ్జెట్
అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే రాజమౌళి కి
ఉన్న బిజినెస్ స్టామి నాని బట్టి ఈ
మొత్తం పెద్దది కాదని,సినిమాపై ఉన్న
భారీ అంచనాలు,మిగతా భాషల్లోకి వెళ్లే
అవకాసం ఇవన్నీ బడ్జెట్ కు సహకరించే అంశాలు
అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ప్రారంభం
రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని
రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి
చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు
తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే
కథ కావటం సినిమాపై అంచనాలు
పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద
మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల
అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం:
ఎం.ఎం.కీరవాణి, కెమెరా:
సెంథిల్కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రవీందర్,
స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ:
డి.సురేష్బాబు, నిర్మాత: సాయి
కొర్రపాటి, కథ,స్క్రీన్ప్లే,
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.
0 comments:
Post a Comment