హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ
రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు,
లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణలపై తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డి శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్పై, కాంగ్రెసు
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్పై కెసిఆర్కు
ప్రేమ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్ అంటే జయప్రకాష్
నారాయణ భయపడుతున్నారని ఆయన అన్నారు.
ఢిల్లీకి,
కడపకు పోటీ అని చెప్పిన
వైయస్ జగన్ ఢిల్లీకి సరెండర్
అయ్యారని ఆయన ఆరోపించారు. ఇది
కడప జిల్లా ప్రజలను వంచించడమేనని ఆయన అన్నారు. తాను
యుపిఎ ప్రభుత్వాన్ని బలపరుస్తానని చెప్పిన జగన్ కడప జిల్లా
ప్రజలను వంచించడం కాదా అని ఆయన
ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలని వైయస్ జగన్ కలలు
కంటున్నారని, ప్రజా సమస్యలపై పోరాడకుండా
తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం
చేస్తానని హామీలు ఇస్తున్నారని ఆయన అన్నారు.
ఓట్లు,
సీట్లు, బంద్లు, విందులతో
తెరాస నాటకాలాడుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం
పార్టీని బహిష్కరించాలని తీర్మానం చేసిన తెరాస పరకాలలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బహిష్కరించాలని ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన అడిగారు. వైయస్
హయంలో సెజ్‌ల పేరు
మీద, ఇతరత్రా పేర్ల మీద దళితుల
భూములను స్వాధీనం చేసుకోవాలని తెరాస తీర్మానం చేయలేదని,
లగడపాటి రాజగోపాల్కు చెందిన ల్యాంకో
స్వాధీనంలో ఉన్న వక్ఫ్ భూములను
స్వాధీనం చేసుకోవాలని తెరాస ఎందుకు పోరాటం
చేయడం లేదని ఆయన అన్నారు.
కెసిఆర్కు జగన్పైనా,
లడపాటిపైన ప్రేమ అని ఆయన
అన్నారు.
అవినీతిపై
పోరాటం చేస్తానని చెబుతున్న లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వైయస్ హయాంలోని అవినీతిపై,
భూకబ్జాలపై ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన
అడిగారు. వైయస్ జగన్ అంటే
జయప్రకాష్ నారాయణ భయపడుతున్నారని ఆయన అన్నారు. దేశమంతటా
జరిగే అవినీతిపై పోరాటాల్లో తన పాత్ర ఉందని
చెప్పే జెపి వైయస్ హయాంలోని
అవినీతిపై పోరాటం చేయడం లేదని ఆయన
అన్నారు. బ్రాహ్మణి స్టీల్స్కు కేటాయించిన భూమిని
ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని జెపి ఎందుకు పోరాటం
చేయడం లేదని ఆయన అడిగారు.
జెపిని ఆయన మైకువీరుడిగా అభివర్ణించారు.
సిద్ధాంతాల
ముసుగులో జెపి కొన్ని పార్టీలకు
కొమ్ము కాస్తున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్
హయాంలో జరిగన భూకేటాయింపులపై, ఒప్పందాలపై
చర్యలు తీసుకోవాలని ప్రధానికి లేఖ రాసే ధైర్యం
జెపికి ఉందా అని ఆయన
అడిగారు. తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఫ్యాషన్గా మారిందని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment