తన అన్న కె. చంద్రశేఖర
రావుపై తెలంగాణ రాములమ్మ అలిగినట్లు వార్తలు వచ్చాయి. రంగా రెడ్డి జిల్లా
వికారాబాద్లో జరిగిన పార్టీ
వార్షికోత్సవ సభలో మాట్లాడేందుకు తెలంగాణ
రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో రాములమ్మ అలిగినట్లు
చెబుతున్నారు. ఇద్దరు మహిళా నేతలకు అవకాశం
ఇచ్చిన కెసిఆర్ తనకు ఇవ్వకపోవడంపై ఆమె
మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. సభ ముగిసిన వెంటనె
కెసిఆర్ కన్నా ముందే ఆమె
హైదరాబాదు చెక్కేశారు.
పార్టీ
వార్షికోత్సవ ప్రతినిధుల సభలో కెసిఆర్ తెలంగాణ
జెఎసి పేరు గానీ, కోదండరామ్
పేరు గానీ ప్రస్తావించకపోవడం కూడా
చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్కసారి సకల
జనుల సమ్మె ప్రస్తావనను మాత్రం
తెచ్చారు. ఆ సమయంలో కూడా
జెఎసి పేరు ఎత్తలేదు. నిరుటి
దశాబ్ది పార్టీ కార్యక్రమంలో మాత్రం జెఎసిని ఆకాశానికెత్తారు. కోదండరామ్ ప్రస్తావన లేకుండా ఇటీవలి కాలం దాకా ఆయన
మాట్లాడలేదు.
పరకాల
ఉప ఎన్నికల తర్వాత వర్క్షాప్ పెట్టుకొని
2012లో చేపట్టాల్సిన కార్యక్రమాలనే కాకుండా 2013లో చేపట్టాల్సిన కార్యక్రమాలను
కూడా ఖరారు చేసుకుంటామని ఆయన
చెప్పారు అప్పుడు కూడా జేఏసీ ప్రస్తావన
తీసుకురాలేదు. తెలంగాణ జెఎసిలో ఇప్పటికీ కొనసాగుతున్న బిజెపిపై కెసిఆర్ ప్రరోక్ష దాడికి పూనుకున్నారు. అయితే, నాయని నర్సింహా రెడ్డి
మాత్రం నేరుగానే విరుచుకుపడ్డారు.
తెలంగాణ
ధూం ధాం వ్యవస్థాపక అధ్యక్షుడు
రసమయి బాలకిషన్ చాలారోజుల తర్వాత తెరాస సభ మీద
మెరిశారు. 2009 ఎన్నికల తర్వాత తెరాసకు దూరమైన బాలకిషన్, ఆ తర్వాత పార్టీ
వార్షికోత్సవ వేదికపై కనిపించటం ఇదే తొలిసారి.
0 comments:
Post a Comment