హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్ట్వేర్
ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో లుంగీతో
ఫ్యాన్కు ఉరేసుకుని అతను
ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కుటుంబ
తగాదాలే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియవని పోలీసులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు దామోదర రావు (32)గా అతన్ని గుర్తించారు.
దామోదర
రావు ఐదేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని కేశవాపురం గ్రామానికి చెందిన శ్వేత అనే అమ్మాయిని
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు ప్రస్తుతం కెపిహెచ్బి కాలనీలోని రాధాకృష్ణ
ఎంక్లేవ్లో ఉంటున్నారు. పెళ్లి
సమయంలో ఇరు కుటుంబాల మధ్య
గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. శ్వేత తల్లిదండ్రులు పెళ్లికి
అంగీకరించగా, దామోదరరావు తల్లిదండ్రులు వ్యతిరేకించారని అంటున్నారు.
ఇరు కుటుంబాల మధ్య తగాదాలే భార్యాభర్తల
మధ్య పొరపొచ్చాలకు దారి తీసి ఉండవచ్చునని
అనుమానిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య
తేడాలు వచ్చి ఉండవచ్చునని కూడా
అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దామోదర రావు టీవీ చూస్తుండగా
శ్వేత పడకగిలోకి వెళ్లి పడుకుంది. సాయంత్రం నాలుగు గంటలకు శ్వేత లేచి చూసేసరికి
మరో పడక గది లోపల
గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా
భర్త పలకకపోవడంతో ఆమె బంధువులకు సమాచారం
అందించింది.
ఆ తర్వాత తలుపును గట్టిగా నెట్టడంతో బోల్డ్ ఊడి తెరుచుకుంది. లోనికి
చూసేసరికి దామోదర రావు ఫ్యాన్కు
లుంగీతో ఉరేసుకుని కనిపించాడు. అతడ్ని భార్య సమీపంలోని ఆస్పత్రికి
తరలించింది. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు
తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని
దర్యాప్తు చేస్తున్నారు.
0 comments:
Post a Comment