హైదరాబాద్:
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్రంగా
మండిపడ్డారు. వైయస్ జగన్పై
ముఖ్యమంత్రి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన సోమవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ను
విమర్శించే నైతిక హక్కు కిరణ్
కుమార్ రెడ్డికి లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం లేదని ప్రజలే అనుకుంటున్నారని
ఆయన అన్నారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ఏ రోజు
కూడా వైయస్ జగన్ను
విమర్శించలేదని, అలా విమర్శించే అవకాశం
కూడా లేదని ఆయన అన్నారు.
మంత్రులే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని
విమర్శిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డిని
కోవర్టుగా చెబుతున్నారని ఆయన అన్నారు. అధికార
కాంగ్రెసు పార్టీకి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి వైయస్ జగన్ ఎజెండాగా
మారారని, ఆ రెండు పార్టీలు
ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు నేతలు విమర్శస్తుంటే మంత్రులు
ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన అడిగారు.
వైయస్
రాజశేఖర రెడ్డికి రక్షణ కవచంలా నిలిచింది
ప్రజలే గానీ నాయకులు కారని
ఆయన అన్నారు. వైయస్ జగన్పై
దుష్ప్రచారం చేసి ఉప ఎన్నికల్లో
ప్రయోజనం పొందాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రులను
అదుపులో పెట్టుకోలేని ముఖ్యమంత్రికి జగన్ విమర్శించే స్థాయి
లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని
తాము గద్దె దించాల్సిన అవసరం
లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో
ప్రభుత్వ పాలనే సాగడం లేదని
ఆయన అన్నారు.
కాంగ్రెసు
పార్టీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయవద్దని,
ప్రమాదానికి గురయ్యే రెండు రోజుల ముందు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ముందు తమతో చెప్పారని ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. తాను పార్టీ విషయంలో
కొన్నిసార్లు తప్పు చేశానని వైయస్
ఓసారి చెప్పారని, కానీ ఎవరూ కూడా
జీవితంలో అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారన్నారు.
ఆ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు.
కానీ జగన్ మాత్రం తండ్రి
మాటలు బేఖాతరు చేస్తూ కాంగ్రెసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైయస్ మాటలను అతను
ఎందుకు విస్మరించాడో తనకు అర్థం కావడం
లేదన్నారు. మహిళలకు అండగా ఉండే పార్టీ
కాంగ్రెసు పార్టీయే అన్నారు.







0 comments:
Post a Comment