హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
సోమవారం మరో అదనపు ఛార్జీషీటును
కోర్టులో దాఖలు చేసింది. ఈ
కేసులో ఇది మూడో ఛార్జీషీట్.
తాజా ఛార్జీషీటులో సిబిఐ ఆరుగురి పేర్లను
నిందితులుగా చేర్చింది. ఎ-1గా వైయస్
జగన్మోహన్ రెడ్డి, ఎ-2గా విజయ
సాయి రెడ్డి, ఎ-3గా జగతి
పబ్లికేషన్స్, ఎ-4గా ఐఏఎస్
వెంకట్రామి రెడ్డి, ఎ-5గా అయోధ్య
రెడ్డి, ఎ-6గా రాంకీ
ఫార్మా సిటీ లిమిటెడ్లను
నిందితులుగా చేర్చింది.
88 పేజీలతో
148 అనుబంధ డాక్యుమెంట్లతో 72 మంది సాక్షుల పేర్లను
ఛార్జీషీట్లో ప్రస్తావించింది. సిబిఐ
ఇప్పటికే మొదటి ఛార్జీషీటుతో పాటు
ఇటీవల మొదటి అదనపు ఛార్జీషీట్ను దాఖలు చేసిన
విషయం తెలిసిందే. తొలి ఛార్జీషీట్లో
పదమూడు మందిని నిందితులుగా పేర్కొన్న సిబిఐ తాజా ఛార్జీషీట్లో ఆరుగురిని పేర్కొంది.
ప్రతి
ఛార్జీషీట్లో ఎ-1గా
జగన్, ఎ-2గా విజయ
సాయి రెడ్డి ఉంటారని గతంలోనే సిబిఐ చెప్పింది. కాబట్టి
ఇప్పటి వరకు దాఖలు చేసిన
మూడు ఛార్జీషీట్లలోనూ వారి పేర్లు
మొదటనే ఉన్నాయి. ఇందులో కొత్తగా ముగ్గురి పేర్లను సిబిఐ చేర్చింది. ఐఏఎస్
అధికారి వెంకట్రామి రెడ్డి వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్
చైర్మన్గా ఉన్న సమయంలో
విశాఖ జిల్లాలో రాంకీ సంస్థకు పరవాడలో
1500 ఎకరాలు కేటాయించినట్లు సిబిఐ తన ఛార్జీషీట్లో పేర్కొంది.
జగన్కు చెందిన జగతి
సంస్థలో రాంకీ సంస్థ రూ.10
కోట్లు పెట్టుబడి పెట్టిందని పేర్కొంది. అందుకు ప్రతిఫలంగా పోలేపల్లి సెజ్లో 77 ఎకరాలు
పొందిందని తెలిపింది. ఈఆర్ఈఎశ్ రూ.8 కోట్లు, సిడబ్లుసి
ఇన్ఫ్రా రూ.2 కోట్లు
రాంకీ పెట్టినట్లుగా సిబిఐ నిర్ధారించింది. కాగా
సిబిఐ ఇటీవల సైబర్ టవర్స్లోని రాంకీ సంస్థలో
సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం
చేసుకున్నారు.







0 comments:
Post a Comment