రాజమండ్రి:
ప్రేమ పేరుతో ప్రియురాలి నగ్న చిత్రాలను, ఆమెతో
తాను గడిపిన క్షణాలను సెల్ఫోన్లో
చిత్రీకరించి తన స్నేహితులతో పాటు
పలువురికి పంపిన నిందితుడిని తూర్పుగోదావరి
జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిల్లాలోని కొత్తకోటలో ఈ దారుణం చోటు
చేసుకుంది. పల్లం రాజు అనే
యువకుడు ఓ బట్టల దుకాణంలో
పని చేస్తున్న అమ్మాయికి ప్రేమిస్తున్నానని కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు. ఓ రోజు ఎవరూ
లేని సమయంలో ఆమెను ఏకాంతంగా గడిపాడు.
పలుమార్లు
ఆమెను కలిశాడు. వీటిని అన్నింటినీ రాజు సెల్ఫోన్లో చిత్రీకరించి, వాటిని
తన స్నేహితులకు పంపించాడు. వారితో కలిసి సదరు యువతిని
బ్లాక్ మెయిల్ చేసేవాడు. తమ వద్దకు కూడా
రావాలని, లేదంటే వీటిని అందరికీ పంపిస్తామని రాజుతో పాటు స్నేహితులు ఆమెను
బ్లాక్ మెయిల్ చేసేవారు.
ఈ తతంగం అంతా రెండు
మూడు నెలలుగా జరుగుతోంది. రాజు ఆమెతో గడిపిన
పలు వీడియోలను స్నేహితులతో పాటు పలువురికి పంపించాడు.
చాలామందికి ఇవి రొటేట్ అయినట్లుగా
తెలుస్తోంది. రాజు తనను మోసగించాడనే
విషయాన్ని గ్రహించిన బాధితురాలు ఇన్నాళ్లు భయపడి విషయాన్ని బయటకు
చెప్పలేక పోయింది. కానీ వారి బ్లాక్
మెయిల్ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తన తల్లిదండ్రులతో
కలిసి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు
నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఆమెను బ్లాక్
మెయిల్ చేసిన అతని స్నేహితులు
గోపాల్, బాలు, రాజేష్, ఆనంద్
తదితరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా నిందితుల నుండి
సంబంధించిన వీడియో క్లిప్స్ను పోలీసులు స్వాధీనం
చేసుకున్నారు. వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పెట్టినట్లుగా తెలుస్తోంది.







0 comments:
Post a Comment